Ads
ఈ వారం రాశి ఫలాలు గురించి తెలుసుకుందాం. పన్నెండు రాశుల వారి ఫలాలు, ఫలితాలు,Weekly Horoscope in Telugu పరిహారాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Video Advertisement
మేష రాశి : సమాజం లో మరింత పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు, ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంది. దగ్గరి వ్యక్తులతో గొడవలు కొని తెచ్చుకుంటారు. విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రత్నిస్తున్నారో వారికి ఈ వారం లో ఇంటర్వ్యూలు ఉండే సూచన కనబడుతుంది. ఈ రాశి వారు విగ్నేశ్వరుణ్ణి పూజించడం మంచిది. కలిసొచ్చే రంగు గులాబీ.
వృషభ రాశి: ఈ వారం రాశి ఫలాలు వ్యాపార వర్గాల వారికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉంది. దేవస్థానాలు సందర్శిస్తారు. వాహన, గృహ కొనుగోలు కి ఈ వారం అనుకూలంగా ఉంది. కళారంగాల వారికి ఎన్నో రోజులుగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచింది..వివాదాలకు దూరంగా ఉండటం ఇంకా మంచి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం మరీ ముఖ్యం. వీరికి ఆకుపచ్చ, నేరేడు రంగు కలిసివస్తాయి. దత్తాత్రేయ స్వామిని పూజించడంద్వారా అంత శుభమే జరుగుతుంది.
మిథున రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగాల్లో మీకు ఉన్న సమస్యలు, చిక్కులు తొలిగి పోతాయి. దీర్ఘకాలంగా ఉన్న కోర్ట్ కేసులు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు గులాబీ, ఎరుపు.
కర్కాటక రాశి: సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. ఇన్ని రోజులుగా ఉన్న సమస్యలు ఊహించని రీతిలో పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు తిరిగి పుంజుకుంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కొన్ని సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. విద్యార్థులకి పూర్తిగా అనుకూలంగా ఉన్నటుంది. కలిసోకిచ్చే రంగు తెలుపు, గులాబీ. విగ్నేశ్వరున్ని పూజించడం మరీ మంచిది.
సింహ రాశి: ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపార వర్గాల వారికి పూర్తిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకి శ్రమ తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు పుష్కలంగా ఉన్నాయి. మీ సన్నిహిత మిత్రుల నుంచి కొన్ని సమస్యలు తప్పవు. ప్రయాణాలకు పూర్తిగా అనుకూలంగా ఉంది. పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక శ్రమ పూర్తి ఫలితం ఇస్తుంది. నరసింహ స్వామి వారిని పూజించడం చాల మంచిది.
కన్య రాశి: భూమి, గృహల కొనుగోలుకు పూర్తిగా అనుకూలంగా ఉంది. గత కొంత కాలంగా ఉన్న సమస్యలు తీరి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల వర్గాలవారికి పూర్తిగా అనుకూలం. రాజకీయవర్గాల వారికి కూడా పూర్తిగా అనుకూలం. కుటుంబం లో మరింత ఆదరణ పొందుతారు. కుటుంబ బాధ్యతలు పూర్తిగా నేర్వవేరుస్తారు. ఆకుపచ్చ, నేరేడు రంగులు కలిసివస్తాయి.
తులా రాశి: నూతన పరిచయాలు ఏర్పతాయి. మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. మీ ఆలోచనలు కార్య రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీ సన్నిహిత బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన పనులు మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం.
వృశ్చిక రాశి: ఈ వారం ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్, రాజకీయాల రంగాల వారికి పూర్తిగా అనుకూలిస్తుంది. ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొత్త పరిచయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాల మంచిది. నిరుద్యోగులకు శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో. శుభఫలితాలు ఉంటాయి.
ధనుస్సు రాశి: ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం. కొత్త నిర్ణయాలు, పనుల్లో. బాగా ఆచి తూచి అడుగులు వెయ్యడం చాలా మంచిది. అన్ని విధాలా ఇదే అనుకూలమైన సమయం. శుభకార్యాలకు అనుగుణంగా ఉంది. ఈ వారం ఆకస్మికంగా ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి కూడా సమయం అనుకూలిస్తుంది.
మకర రాశి: ఈ వారం ఆర్థికంగా ఇబ్బందలు తప్పవు, ఎవరైతే రుణాలు కోసం ఎదురు చూస్తున్నారో వారు మరింత సమయం వేచి చూడక తప్పదు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలని ఇస్తాయి. ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఉందొ వారికి మరిన్ని చిక్కులు తప్పవు. మానసికంగా కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు.
కుంభ రాశి: మితిమీరిన ఖర్చులు చేస్తారు. మీరు ఊచించనివారితో దగ్గరివ్యక్తుల తోనే మీకు వివాహాసూచనలు ఉన్నాయి. పోలీసు, ఉపాధి న్యాయ, మిలిటరీ రంగాల వారికి ఉన్నత పదువులు లభిస్తాయి. మీ సన్నిహితులకు గాని, బంధుమిత్రులకు కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోవడమే మంచిది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితులని కలిసి కాల క్షేపం చేస్తారు.
Also read: MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !
మీనం రాశి: వ్యాపార రంగాల వారికి పూర్తి అనుకూలం. మీ సహా ఉద్యోగులచే ఇబ్బందులు తప్పవు, ఆదాయ పరంగా, ఆరోగ్య పరంగా పూర్తి అనుకూలం. మీరు ఇదివరకే ఇచ్చిన రుణాలు తిరిగి చేతికి అందుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి పూర్తి అనుకూలమైన సమయం. చిన్న వ్యాపారులవారికి కూడా అనుకూలం.
End of Article