పంజాబ్ తో మ్యాచ్ లో KKR డగౌట్ నుండి బాట్స్మెన్ కి పంపించిన ఆ 54 కోడ్ సిగ్నల్ ఏంటి .?

పంజాబ్ తో మ్యాచ్ లో KKR డగౌట్ నుండి బాట్స్మెన్ కి పంపించిన ఆ 54 కోడ్ సిగ్నల్ ఏంటి .?

by Mohana Priya

Ads

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2021 లో 8 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. అయితే, పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అనలిస్ట్ నాథన్ లిమోన్ 54 అనే నంబర్ ఉన్న ప్లకార్డ్ పట్టుకుని కనిపించారు. అప్పటి నుంచి ఫాన్స్ ఇంకా కామెంటేటర్స్ ఆ నంబర్ వెనకాల ఉన్న అర్థం ఏంటి అని డీకోడ్ చేయడం మొదలుపెట్టారు.

Video Advertisement

ఇప్పుడు ఈ చర్చలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరారు. ఇందులో తప్పేమీ లేదు అని పేర్కొన్నారు. ఈ విషయంపై సెహ్వాగ్ మాట్లాడుతూ, “ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ ని మనం ఆర్మీలో చూశాం. నాకు తెలిసి 54 అనే నెంబర్ ఆ పర్టిక్యులర్ సమయంలో, ఆ పర్టిక్యులర్ బౌలర్ బౌలింగ్ గురించి వారు వేసుకున్న ప్లాన్ పేరు అయి ఉండొచ్చు. మానేజ్మెంట్, కోచ్ లు కెప్టెన్ కి డగౌట్ నుండి సహాయం అందించాలని అనుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను”.

“దీంట్లో కోపం తెచ్చుకునే విషయం లేదు. కానీ వారు బయట నుండి ఆటని నిర్దేశిస్తూ ఉంటే ఎవరికైనా కెప్టన్ అయ్యే అవకాశం ఉంది కదా? ఇందులో అప్పుడు ఇయోన్ మోర్గాన్ కి ఎటువంటి పాత్ర ఉండదు. ఏ ప్లేయర్ అయినా సరే బయటి నుండి కచ్చితంగా సహాయం పొందాలి అని నేను కూడా అనుకుంటాను. కానీ కెప్టెన్ కి ఏ రకమైన బౌలర్ ని, ఎప్పుడు ఫీల్డ్ లోకి పంపించాలి అనే విషయంపై ఒక ఐడియా ఉంటుంది”.

what is code 54 sent from kkr dugout during pbks match

బయట నుండి ఎటువంటి సహాయం తీసుకోవద్దు అని నేను అనడం లేదు. ఎందుకంటే 25 వ ప్లేయర్ కూడా మంచి సలహా ఇవ్వగలరు. కానీ ఈ సలహా కెప్టెన్ కి సహాయపడే విషయం మాత్రమే కావాలి. “అరే నేను ఇలా ఆలోచించలేదే” అని అనుకోవాలి. అంతే కాకుండా ఒకవేళ కెప్టెన్ ఏదైనా మర్చిపోయి ఉంటే ఆ కోడ్ అనేది అతనికి ఆ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా అయితే ఇందులో ఎటువంటి సమస్య లేదు” అని అన్నారు.


End of Article

You may also like