రాత్రిపూట అన్నమా..? చపాతీనా..? రెండిటిలో ఏది తింటే మంచిదంటే..?

రాత్రిపూట అన్నమా..? చపాతీనా..? రెండిటిలో ఏది తింటే మంచిదంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మన బరువు మనకు చాలా సార్లు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. మనలో చాలా మంది బరువు తగ్గాలనుకున్నప్పటికీ తగ్గ లేకపోతారు. అయితే.. బరువు తగ్గించుకోవాలి అనుకోగానే చాల మంది చేసే మొట్ట మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం.

Video Advertisement

దానికి కారణం ఏంటంటే వైట్ రైస్ వలన చాలా కాలరీస్ అందుతాయి కాబట్టి బరువు పెరిగిపోతూ ఉంటామని భావిస్తూ ఉంటారు. బరువు మాత్రమే కాదు.. ఇతర చిన్న చిన్న సమస్యలకి కూడా అన్నం తినడం మానేస్తూ ఉంటారు.

rice 1

అసలు రాత్రి పూట అన్నం తినాలా..? చపాతీ తినాలా..? ఈ రెండిటిలో ఏది తింటే మంచిది..? అనే విషయాన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది రాత్రిపూట చపాతీలు తీసుకోవడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. దీనికి వారు చెప్పే కారణం ఏంటంటే బరువు తగ్గుతారని, ఆరోగ్యకరమని, షుగర్ అదుపులో ఉంటుందని చెబుతుంటారు.

rice 2

కొందరేమో అన్నం తినకపోతే తిన్నట్లు ఉండదు అన్న కారణంగా అన్నాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, ఈ రెండిటిలోనే పిండి పదార్ధాలు ఉంటాయి. ఎక్కువ స్థాయిలో తీసుకుంటే.. మనకు అవసరమైన పిండి పదార్ధాలు ఖర్చు అయిపోగా.. మిగిలిన పిండి పదార్ధాలు కొవ్వు రూపంలోకి మారిపోతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెండు మంచి ఆప్షన్స్ కావు.

rice 3

మరి ఏమి తినాలో ఇప్పుడు చూద్దాం. సాయంత్రం సమయంలో ఉడకపెట్టిన పెసలు, సెనగలు, తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి. లేదా నట్స్, పండ్లు కూడా తీసుకోవచ్చు. రాత్రి సమయంలో చిరు ధాన్యాలు తీసుకోవడం మంచిది. అంటే.. సామలు, అరికెలు, రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి వాటిని ఉప్మా లేదా దోసలలాగా చేసుకుని తినాలి. దీనివలన అన్నివిధాలుగాను ఆరోగ్యంగా ఉంటారు.


End of Article

You may also like