కాన్సర్ పేషెంట్స్ కోసం హెయిర్ ని ఎందుకు డొనేట్ చేస్తారు..? ఆ హెయిర్ ని ఎలా ఉపయోగిస్తారో తెలుసా..?

కాన్సర్ పేషెంట్స్ కోసం హెయిర్ ని ఎందుకు డొనేట్ చేస్తారు..? ఆ హెయిర్ ని ఎలా ఉపయోగిస్తారో తెలుసా..?

by Anudeep

Ads

కాన్సర్ పేషెంట్స్ పడే ఇబ్బందులు మాములుగా ఉండవు. అయితే వీరిలో చాలా మందికి విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనివల్ల వారు ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అయితే.. చాలా మంది వీరి కోసం తమ హెయిర్ ని డొనేట్ చేస్తూ ఉంటారు. ఇలా కాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ ని డొనేట్ చేసేవాళ్ళని మనం చాలా మందిని చూసే ఉంటాం.

Video Advertisement

అయితే.. ఈ హెయిర్ ని ఎందుకు డొనేట్ చేస్తారో తెలుసా..? ఆ హెయిర్ కాన్సర్ పేషెంట్ల కోసం ఎలా వినియోగిస్తారో తెలుసా..? ఆ విషయాన్నీ మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

cancer patients 1

ఇలా పేషెంట్స్ కోసం డొనేట్ చేయబడిన హెయిర్ ని కాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు, పెద్దలకు విగ్స్ చేసి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. వారికి విగ్స్ ని బహూకరించి తిరిగి వారిలో విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ సంస్థల ముఖ్య ఉద్దేశ్యం. చాలా సంస్థలు జుట్టుని విరాళంగా స్వీకరిస్తూ ఉంటాయి. ఈ స్వీకరించడంతో సంస్థలకు ప్రత్యేక నియమాలు ఉంటాయి.

cancer patients 2

రకరకాల పొడవు ఉన్న వెంట్రుకలను వీరు తీసుకుంటారు. అయితే.. చాలా సంస్థలు రంగు వేయబడిన హెయిర్ ను మాత్రం తీసుకోవు. ఒకవేళ మీ హెయిర్ ఆయా సంస్థల రిక్వైర్మెంట్ కు మ్యాచ్ కాకపోతే.. మీ హెయిర్ ని మరో మంచి పనికి కూడా వారు వినియోగిస్తారు. డబ్బులు డొనేట్ చేయలేకపోయినా.. హెయిర్ ని డొనేట్ చేయడం వల్ల కూడా కాన్సర్ పేషెంట్స్ కు ఎంతో కొంత సాయం చేసినట్లు అవుతుంది.

cancer patients 3

సాధారణంగా విగ్ లు తయారు చేయడానికి సింథటిక్ హెయిర్ ను, మానవ సహజ హెయిర్ ను ఉపయోగించవచ్చు. కానీ సింథటిక్ హెయిర్ తో ఉపయోగించి తయారు చేసిన విగ్ కంటే మానవ హెయిర్ తో చేసిన విగ్ లే సహజంగా అనిపిస్తాయి. అందుకే.. ఇవి కాన్సర్ పేషెంట్స్ కు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడంలో ఎక్కువ దోహదం చేస్తాయి. వీటి ఖరీదు కూడా ఎక్కువే. అందుకే.. కాన్సర్ పేషెంట్స్ కు ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా వారికి ఆత్మవిశ్వాసం పెంచడం కోసం హెయిర్ ని డొనేట్ చేయాలంటూ పలు ఆసుపత్రులు పిలుపునిస్తూ ఉంటాయి.


End of Article

You may also like