వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇకపై కాల్ స్టార్ట్ అయ్యాక కూడా జాయిన్ అవ్వచ్చు.. ఎప్పటినుంచంటే..?

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇకపై కాల్ స్టార్ట్ అయ్యాక కూడా జాయిన్ అవ్వచ్చు.. ఎప్పటినుంచంటే..?

by Anudeep

Ads

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ ఇస్తూ వినియోగదారులకు ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే వాయిస్ కాల్, వీడియో కాల్స్ తో పలు అప్ డేట్ లు ఇచ్చిన వాట్సాప్ తాజాగా మరొక అప్ డేట్ తీసుకురాబోతోందట. జూమ్ కాలింగ్ మాదిరిగానే ఇకపై కాల్ స్టార్ట్ అయిపోయాక కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వొచ్చట. ఐతే.. ఇందుకు సంబంధించి వాట్సాప్ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. ప్రస్తుతానికి వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

whatsapp feature

కానీ పొరపాటున కాల్ కట్ అయితే.. తిరిగి కనెక్ట్ అవ్వాలంటే.. కాల్ లో ఉన్న ఎవరైనా మిమ్మల్ని ఆడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి అవసరం లేకుండా.. ఈ ఇబ్బందిని తప్పించాలని వాట్సాప్ యోచిస్తోంది. ఫేస్ టైమ్ ఇంటర్‌ఫేస్‌తో సమానమైన కాలింగ్ కోసం వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోందట. WABetaInfo ప్రకారం, వాట్సాప్ వినియోగదారుడు గ్రూప్ కాల్ ను టెంపరరీ గా విస్మరించవచ్చు. కొంత సమయం తరువాత తిరిగి కాల్ లోకి జాయిన్ అవచ్చు. దీనివలన ఇతర యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ దిశగా ఇంటర్ ఫేస్ ను డెవలప్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.


End of Article

You may also like