క్వాలిటీ కెమెరాలు ఎన్ని వచ్చినా.. సిసి టీవీ కెమెరా మాత్రం లో క్వాలిటీలో ఎందుకు ఉంటుంది..? అసలు కారణం ఇదే..!

క్వాలిటీ కెమెరాలు ఎన్ని వచ్చినా.. సిసి టీవీ కెమెరా మాత్రం లో క్వాలిటీలో ఎందుకు ఉంటుంది..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

ప్రస్తుతం కెమెరాలు మన జీవితం లో భాగం అయిపోయాయి.. ఎక్కడికైనా వెళ్లినా.. ఎవరినైనా కలిసినా.. ఒక ఫోటో తీసుకోవడం, మన ఫ్రెండ్స్ తో పంచుకోవడం పరిపాటి అయిపొయింది. ఈ మధ్య వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా క్వాలిటీ కూడా చాలా హై రేంజ్ లో ఉంటోంది.

Video Advertisement

సాంకేతికపరంగా కెమెరాల విషయంలో చాలా అభివృద్ధి సాధించాము. కానీ ఇవి ఎంతగా మారినా.. సిసి టివి కెమెరాల ఫుటేజీ మాత్రం చాలా తక్కువ క్వాలిటీ తోనే ఉంటోంది. అయితే ఇలా ఎందుకు ఉంటుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

cc tv 1

నిజానికి సిసి టివి కెమెరాలు మనకి రక్షణ కల్పించడంలో ఎంతగానో దోహదం చేస్తాయి. అన్ని పబ్లిక్ ప్రదేశాల్లోనూ, ట్రాఫిక్ రోడ్స్ పైన ఇవి దర్శనం ఇస్తూ ఉంటాయి. సమాజంలో జరిగే దొంగతనాలు, క్రైమ్ లను గుర్తించడానికి సిసి కెమెరాలు పోలీసులకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇంతగా ఉపయోగపడే సిసి టివి కెమెరాల క్వాలిటీ ఎందుకు తక్కువగా ఉంటుంది..?

cc tv 2

వాస్తవానికి ఫోన్ లో ఉపయోగించే కెమెరాలు, సిసి టివి కోసం ఉపయోగించే కెమెరాలు ఒకే రకమైన సాంకేతికని కలిగి ఉండవు. ఫోన్ లో వాడే కెమెరాలు చాలా క్వాలిటీ తో, రంగు ని కూడా కాప్చర్ చేసి చూపించగలవు. అయితే.. సరైన వెలుతురు ఉంటేనే ఈ ఫోటోలు క్లారిటీగా వస్తాయి. ఇక సిసి కెమెరాల విషయానికి వస్తే.. ఇవి రంగుతో సహా ఏదైనా ఘటనని కాప్చర్ చేయాల్సిన అవసరం లేదు.

cc tv 3

చాలా వరకు సిసి కెమెరాలలో IR (ఇన్ఫ్రా రెడ్) టెక్నాలజీ అమర్చబడి ఉంటుంది. ఈ టెక్నాలజీ సాయంతో అవి రాత్రి పూట్ల.. ఎంత చీకటిగా ఉన్నప్పటికీ ఆ ప్రదేశాలను ప్రకాశవంతంగా చేసి కాప్చర్ చేస్తాయి. అందుకే సిసి టివి ఫుటేజీ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తుంది. ఇలా ఉండడం వల్లే.. చీకటి సమయాల్లో కూడా సిసి కెమెరాలు ఏమి జరిగినా కాప్చర్ చేయగలుగుతూ ఉంటాయి.


End of Article

You may also like