డ్రైవింగ్ సీట్ కొన్ని దేశాలలో కుడి వైపు.. మరి కొన్ని దేశాల్లో ఎడమవైపు ఎందుకు ఉంటుంది..? అసలు కారణం ఇదే..!

డ్రైవింగ్ సీట్ కొన్ని దేశాలలో కుడి వైపు.. మరి కొన్ని దేశాల్లో ఎడమవైపు ఎందుకు ఉంటుంది..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఎడం వైపు డ్రైవింగ్ సీట్ ఉంటుంది. అయితే మరి కొన్ని దేశాల్లో కుడి వైపు ఉంటుంది. ఎప్పుడైనా ఎందుకు కొన్ని దేశాల్లో ఎడుమ పక్క డ్రైవింగ్ సీట్ వుంటుంది అన్న సందేహం మీలో కలిగిందా..? మరి దాని కోసం ఇప్పుడే చూద్దాం. నిజానికి డ్రైవింగ్ సీట్స్ లో తేడా ఉండడానికి కొన్ని రకాల చారిత్రాత్మక సంఘటనలు కారణాలుగా నిలిచాయి.

Video Advertisement

అయితే అవి ఎంతో ఆసక్తికరమైన విషయాలు అనే చెప్పాలి. ప్రస్తుతం డ్రైవింగ్ సీట్లలో నాలుగు చక్రాల వాహనాలు లో తేడాలు ఉంటున్నాయి, అయితే చాలా సంవత్సరాల క్రితం గుర్రం బండికి సంబంధించిందని గమనించాలి. వ్యాపారస్తులు గుర్రపు బండి నడిపేటప్పుడు మధ్యలో ఉండి కంట్రోల్ చేస్తూ ఉండేవారు.

ఇలా చేయడం వల్ల వారు తీసుకెళ్లి సరుకు ఎడమవైపు ఉండడానికి వీలుగా ఉండేది మరియు డ్రైవర్ కి కూడా సరైన ఖాళీ ఉంటుంది. అలానే యుద్ధం చేసే సమయంలో గుర్రం బండి ఎక్కి ఎడం చేత్తో నడుపుతూ, కుడి చేత్తో కత్తులు పట్టుకుని ఉండే వారు.

ఈ విధంగా యుద్ధాలను ఎదుర్కొనే వారు మరియు క్రమంగా సైనికులు ఎడమ వైపున డ్రైవర్ సీట్ ని క్రమంగా ఫిక్స్ చేసారు. అయితే ప్రపంచంలో కుడి చేతి వాటం ఉన్న వారు ఎక్కువ శాతం ఉండడంతో కొన్ని మార్పులు కూడా చేశారు. ఇక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయం లో క్యాపిటలిజం పెరిగింది. దాంతో ఎగుమతులు కూడా పెరిగాయి.

ఆ సమయంలో సామాన్లను తీసుకువెళ్లడానికి గుర్రాలను మరియు స్టీమ్ ఇంజన్స్ ను ఉపయోగించేవారు. గుర్రంను కంట్రోల్ చేయడానికి డ్రైవర్ పైన కూర్చుని ఉండటం జరిగేది, అయితే ఎడమ వైపున ఉండడం వల్ల మిగిలిన గుర్రాలను కంట్రోల్ చేయడం కష్టం అయ్యింది. దాంతో క్రమంగా కుడి వైపుకు మార్చడం జరిగింది. కొన్ని చోట్ల ఎడమ వైపు మరి కొన్ని చోట్ల కుడి వైపు డ్రైవింగ్ సీట్ ఉండడానికి ఇదే కారణం.


End of Article

You may also like