30 ఏళ్ళు దాటిన మహిళలు ఆరోగ్యాంగా ఉండాలంటే… ఇలా తప్పక ఫాలో అవ్వాలి.!

30 ఏళ్ళు దాటిన మహిళలు ఆరోగ్యాంగా ఉండాలంటే… ఇలా తప్పక ఫాలో అవ్వాలి.!

by Megha Varna

Ads

ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు..? నిజానికి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అయితే మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. ముఖ్యంగా వయసు పైబడే కొద్ది మన ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకనే 30 ఏళ్లు దాటిన మహిళలు తప్పకుండా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి.

Video Advertisement

అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అధికరక్తపోటు, థైరాయిడ్, షుగర్, మానసిక సమస్యలు మొదలైనవి వాస్తు ఉంటాయి.

అందుకనే మహిళలు ఎక్కువగా పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా వ్యాయమం చేయడం, సరిగా వేళకు నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం లాంటివి చేయాలి. అయితే ఈ రోజు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య గల స్త్రీలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి..?, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం.

వెల్లుల్లి:

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లిలో అద్భుతమైన గుణాలు ఉంటాయి. అలానే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రాకుండా చూసుకుంటుంది. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య పెరుగుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే వెల్లుల్లి తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.

గుడ్లు:

గుడ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో ఫ్యాట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్ డి కూడా ఉంటుంది.

కూరగాయలు:

కూరగాయలు, ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ప్రతిరోజూ పోషక పదార్థాలు ఉండే కూరగాయలు తీసుకుంటూ ఉండండి.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి మనకి లభిస్తుంది. ఇమ్యూనిటీని పెంచడానికి సిట్రస్ ఫ్రూట్ బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు ఉండవు. క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తాయి.

 


End of Article

You may also like