Ads
స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అయితే ఏ ఫోన్ ని ఐన ఎంతసేపు వాడగలం.. ఫుల్ ఛార్జ్ చేస్తే 24 అవర్స్ స్టాండ్ బై ఇస్తుంది. కానీ, జియో వచ్చినతరువాత మన వాడకం రేంజ్ లు బాగా పెరిగాయి కాబట్టి కంటిన్యు గా వాడితే 8 నుంచి 10 గంటలు వస్తున్నాయి. ఆ తరువాత ఛార్జ్ చేసుకోవాలి అంటే ఫోన్ ని పక్కన పెట్టెయ్యాలి. ఇకపై ఇలాంటి బాధలు అవసరం లేదు. గాలిలోనే మీ బాటరీ ని ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ ని వాడుకుంటూనే రూమ్ లో రిమోట్ కనెక్టివిటీ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.
Video Advertisement
షియోమీ రెడ్ ఎం ఐ ఈ కొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇకపై షియోమీ “రిమోట్ ఛార్జింగ్ టెక్నాలజీ” ఒకేసారి పలు పరికరాలను ఛార్జ్ చేయగలదు. ఇటీవలే షియోమీ ఈ టెక్నాలజీ ని ప్రవేశపెడుతున్నట్లు ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించింది. షియోమీ అందించే ట్రాన్స్మిటర్ రిమోట్ కనెక్టివిటీ ద్వారా మీ మొబైల్ ను ఛార్జ్ చేస్తుంది. అయితే ఇది కొంచం పెద్ద సైజు లో ఉంటుంది. దీనిని మీ రూమ్ లో ఓ పక్క గా అరెంజ్ చేసుకుని మీ మొబైల్ ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం, మొబైల్ ఫోన్ లో యాంటెన్నాలను అమరుస్తారు. వీటి సాయం తో రిమోట్ లో కనెక్ట్ అవడం సాధ్యం అవుతుంది.
End of Article