భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి టి20లో కేఎల్ రాహుల్ రికార్డు

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి టి20లో కేఎల్ రాహుల్ రికార్డు

by Megha Varna

Ads

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి టి20లో కూడా టీం ఇండియా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  భారత్ కు ఎదురులేకుండా పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌, రోహిత్ శర్మ దుమ్మురేపారు. రాహుల్ 45, రోహిత్ 60 పరుగులు చేశారు. ఓపెనర్ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ని నిర్మించారు.

Video Advertisement

ఇద్దరు కలిసి రెండో వికెట్ కి దాదాపు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కివీస్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ 50, రాస్ టేలర్ 53 పరుగులు చేశారు. అయితే చివరి ఓవర్లో ఇష్ సోధీ ఊపు చూస్తే ఆతిథ్య జట్టు గెలుస్తుందనే అనిపించింది. రెండు భారీ సిక్సర్లతో టీమిండియా శిబిరంలో గుబులు రేపాడు. అయితే చివరి రెండు బంతుల్లో భారీ షాట్లు కొట్టలేకపోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. ఓ దశలో కివీస్ సజావుగానే లక్ష్యఛేదన చేస్తుందనిపించినా, బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచాడు. 


End of Article

You may also like