క్రికెట్ లో ఈ 10 రకాలుగా అవుట్ ఇస్తారని మీకు తెలుసా.? 9 వ ది అస్సలు ఊహించి ఉండరు.!

క్రికెట్ లో ఈ 10 రకాలుగా అవుట్ ఇస్తారని మీకు తెలుసా.? 9 వ ది అస్సలు ఊహించి ఉండరు.!

by Mohana Priya

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

types of outs in cricket

ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. అయితే క్రికెట్ లో అవుట్ అనేది మనందరికీ ఐడియా ఉంది. కానీ అవుట్ లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

#1 బౌల్డ్

ఒకవేళ బౌలర్ బంతి వేసినప్పుడు ఆ బాల్ బ్యాట్స్ మెన్ వెనకాల ఉన్న స్టంప్స్ లేదా బెయిల్ కి తగిలినట్లయితే అప్పుడు ఆ బ్యాట్స్ మెన్ ని బౌల్డ్ కిందట పరిగణిస్తారు.

types of outs in cricket

#2 కాట్

ఒక బ్యాట్స్ మెన్ మూడు రకాలుగా కాట్ అవ్వచ్చు.

types of outs in cricket

కాట్ బిహైండ్

ఒకవేళ బౌలర్ వేసిన బాల్ బ్యాట్స్ మెన్ యొక్క గ్లోవ్స్ కి కానీ బ్యాట్ కి కానీ టచ్ చేసినప్పుడు అది వెళ్ళి గ్రౌండ్ కి టచ్ అవ్వకుండా వికెట్-కీపర్ పట్టుకున్నప్పుడు కాట్ బిహైండ్ కిందకి వస్తుంది.

types of outs in cricket

కాట్ అండ్ బౌల్డ్

ఒకవేళ బౌలర్ ఒక బ్యాట్స్ మాన్ యొక్క గ్లోవ్స్ లేదా బ్యాట్ కి తగిలిన బాల్ పట్టుకుంటే అది కాట్ అండ్ బౌల్డ్ కిందకి వస్తుంది.

types of outs in cricket

కాట్ బై ఫీల్డర్

ఇది కాట్ అండ్ బౌల్డ్ రూల్స్ కి దగ్గరగానే ఉంటుంది కాకపోతే ఫీల్డర్ క్యాచ్ పట్టుకుంటాడు.

types of outs in cricket

#3 స్టంప్డ్

types of outs in cricket

ఒకవేళ బ్యాట్స్ మ్యాన్ యొక్క శరీరంలోని ఏ ఒక్క భాగం కానీ బ్యాట్ కానీ క్రీజ్ లో లేనప్పుడు, ఒకవేళ వికెట్ కీపర్ బెయిల్స్ ను తీసేస్తే అప్పుడు స్టంప్డ్ కిందకి పరిగణిస్తారు. ఒకవేళ వికెట్ కీపర్ బెయిల్ ఇవ్వకముందే బాల్ అతనిని చేరుకుంటే అప్పుడు బ్యాట్స్ మెన్ కి అవుట్ ఇవ్వరు.

#4 లెగ్ బిఫోర్ వికెట్ (LBW)

types of outs in cricket

ఒక బ్యాట్స్ మాన్ శరీరానికి కానీ, లేదా బ్యాట్, గ్లోవ్స్ కాకుండా వేరే ఏదైనా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి ఈ కానీ బాల్ తగ్గినప్పుడు లేదా బాల్ స్టంప్స్ కి తగిలింది అని అనుకున్నప్పుడు లెగ్ బిఫోర్ వికెట్ ఇస్తారు

#5 రనౌట్

types of outs in cricket

ఒకవేళ బ్యాట్స్ మెన్ వికెట్స్ మధ్యలో పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, బ్యాట్స్ మెన్ వికెట్ చేరుకోవడానికి ముందే ఆ ఫీల్డింగ్ టీం కి బంతి దొరికితే అప్పుడు రనౌట్ కిందట పరిగణిస్తారు.

#6 హిట్ వికెట్

types of outs in cricket

ఒకవేళ షాట్ ఆడేటప్పుడు కానీ లేదా రన్ మొదలు పెట్టేటప్పుడు కానీ బ్యాట్స్ మెన్ స్టంప్స్ ని తన శరీరంతో గానీ లేదా ఏదైనా స్పోర్ట్స్ పరికరంతో కానీ తొలగించినప్పుడు దానిని హిట్ వికెట్ అంటారు.

#7 ఫీల్డ్ ని అడ్డుకోవడం

types of outs in cricket

ఒకవేళ ఎవరైనా బ్యాటర్ వారి పనుల ద్వారా కానీ లేదా మాటల ద్వారా కానీ ఆట ని అడ్డుకుంటే లేదా ఫీల్డింగ్ టీం వేసిన బాల్ ని వికెట్లకు తగలకుండా అడ్డుకున్నా కూడా లా 37 ప్రకారం ఫీల్డ్ ని అడ్డుకోవడం కిందట పరిగణిస్తారు.

#8 రిటైర్డ్ అవుట్

types of outs in cricket

ఒకవేళ ఒక బ్యాట్స్ మెన్ ఏదైనా గాయం వల్ల కానీ ఇంకా ఏదైనా కారణం వల్ల గానీ మైదానాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించినలేనప్పుడు రిటైర్డ్ అవుట్ గా పరిగణించబడతారు.

#9 బాల్ ని రెండుసార్లు కొట్టడం

types of outs in cricket

ఒక బ్యాట్స్ మెన్ ఒక బంతిని రెండు సార్లు కొడితే లా 34 ప్రకారం ఈ అవుట్ ఇస్తారు. మొదటిసారి బాల్ బ్యాట్ కి తగిలినప్పుడు, రెండోసారి కావాలనే కొట్టినప్పుడు ఈ అవుట్ ఇస్తారు. అయితే రెండోసారి బ్యాట్ తోనే కొట్టాల్సిన అవసరం లేదు ఆ బ్యాట్స్ మెన్ నుండి ఏ విధంగా అయినా కూడా రెండోసారి కొట్టడం జరిగితే ఈ అవుట్ ఇస్తారు.

#10 టైమ్డ్ అవుట్

types of outs in cricket

ఇది క్రికెట్ లో ఇచ్చే చాలా రేర్ అవుట్స్ లో ఒకటి. ఒకవేళ బ్యాట్స్ మెన్ ఒక ఇచ్చిన టైం లోనే రాలేకపోతే, అపోజిషన్ టీం వాళ్ళు అప్పీల్ చేస్తే అంపైర్ ఆ బ్యాట్స్ మెన్ కి అవుట్ ఇస్తారు.


End of Article

You may also like