Home Sports Adda 2023 క్రికెట్ ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చింది….!

2023 క్రికెట్ ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చింది….!

by Sainath Gopi

2023 సంవత్సరంలో తీసుకుంటే క్రికెట్ అభిమానులకు నిరాశ మిగిలింది. 2023లో వన్డే ప్రపంచ కప్ లో భారత్ అద్భుతంగా రాణించి కప్పు సాధిస్తుందని భారత అభిమానులు అందరూ ఎన్నో అసలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే భారత టీం కూడా మంచి ప్రదర్శన కనబరిచి ఫైనల్ కీ చేరుకుంది.అయితే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజ్యం పొంది యావత్తు భారత అభిమానులను తీరనీ శోకంలో ముంచేసింది.

mistakes by team india in world cup semi finals

2023 సంవత్సరాన్ని భారత్ క్రికెట్ అభిమానులు ఎవరు తమ జీవితంలో మర్చిపోలేని విధంగా చేదు జ్ఞాపకంగా మిగిలింది. అయితే కొంతమంది స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన అందరికీ ఆనందాన్ని కలుగజేసింది. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన కనబరచడంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక రోహిత్ శర్మ ఫాన్స్ కి అయితే నిరాశ తప్పలేదు. వండే ప్రపంచ కప్ లో ఓడిపోవడం కెప్టెన్ గా ప్రపంచకప్ గెలవలేకపోవడం తీర ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఇలా దెబ్బ మీద దెబ్బతో రోహిత్ అభిమానులు మునిగిపోయారు.

You may also like