పైసా వసూల్ పెర్ఫార్మెన్స్ అంటే వీళ్లదే … IPL 2023 లో తీసుకున్న డబ్బులకు న్యాయం చేసిన 3 ప్లేయర్స్.!

పైసా వసూల్ పెర్ఫార్మెన్స్ అంటే వీళ్లదే … IPL 2023 లో తీసుకున్న డబ్బులకు న్యాయం చేసిన 3 ప్లేయర్స్.!

by kavitha

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్  2023 వేలంలో కొంతమంది ప్లేయర్స్ ను భారీ మొత్తానికి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. వారిలో కొందరు తమకు పెట్టిన ధరకు న్యాయం చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు.

Video Advertisement

మరికొందరు ప్లేయర్స్ జట్టు అంచనాలను నిలబెట్టలేకపోయారు. అయితే జట్టు తమ మీద పెట్టుకున్న అంచనాలను నిలబెడుతూ, తమకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. కామెరాన్ గ్రీన్:

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ జట్టు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో  ఓటమి పాలయ్యింది.  2023 వేలంలో ముంబై జట్టు కొత్త మ్యాచ్ విన్నర్ కామెరూన్‌ను కొనుగోలు చేశారు. ఈ ఆల్ రౌండర్‌ను 17.5 కోట్ల రూపాయల భారీ మొత్తానికి ముంబై జట్టు కొనుగోలు చేసింది. 23 ఏళ్ల కామెరూన్‌ లీగ్ రౌండ్‌లో తన జట్టు కోసం  కొన్ని అద్భుతమైన నాక్‌లను అందించాడు.
వాంఖడే స్టేడియంలో 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు పై కామెరూన్‌  అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్నో జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో, కామెరూన్‌ 23 బంతుల్లో 41 పరుగుల చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. చురుకైన ఆసీస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై జట్టు బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేశాడు. 16 గేమ్‌లలో 160.28 అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు.

2. నికోలస్ పూరన్:

నికోలస్ పూరన్ ప్లేఆఫ్స్ వరకు లక్నో జట్టులో ఉన్న కీలక సభ్యులలో ఒకరు. ఈ  స్టైలిష్ వెస్టిండీస్ బ్యాటర్ ను మినీ వేలంలో భారీ మొత్తంలో 16 కోట్లకు కొనుగోలు చేశారు. లక్నో జట్టు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నప్పుడు వారి బ్యాటింగ్ లైనప్‌కు ప్రోత్సాహాన్ని అందించే బాధ్యతను పూరన్ కి ఇచ్చారు.
పూరన్ లక్నో జట్టు తరుపున కొన్ని అద్భుతమైన క్షణాలను అందించాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 15వ మ్యాచ్‌లో, బెంగళూరు జట్టు పై 19 బంతుల్లో 62 పరుగులతో అపూర్వమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే ఒక వికెట్‌ తీసి, లక్నో జట్టు అద్భుత విజయంలో కీలక పాత్రను పోషించాడు. ప్లేఆఫ్స్ వరకు లక్నో జట్టు ప్రయాణంలో, 172.94 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 15 మ్యాచ్‌లలో 358 పరుగులు చేశాడు.

3.హెన్రిచ్ క్లాసెన్:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు  16 వ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 4 విజయాలు, 10 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.  హైదరాబాద్ జట్టు కీలక ఆటగాళ్లు అయిన హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్‌రామ్, ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్ మొత్తం రాణించలేకపోయారు. దాంతో ఆ జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. అయితే, ఈ జట్టులో గొప్పగా ఆడిన ఒక ప్లేయర్ వికెట్ కీపర్ మరియు బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.
మెజారిటీ హైదరాబాద్ జట్టు మ్యాచ్‌లలో, గొప్పగా ఆడిన ఏకైక ప్లేయర్ క్లాసెన్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బెంగళూరు జట్టు పై తన తొలి ఐపీఎల్ సెంచరీని బాదాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తన ఈ  సీజన్‌ లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 448 పరుగులతో, 177.07 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాయి.

Also Read: “ధోనీ లాగానే వేరే వాళ్ళు ప్రవర్తిస్తే ఊరుకుంటారా..?” అంటూ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like