FOREIGN CRICKETERS: మాక్స్వెల్ లాగే…భారతీయ మహిళలను పెళ్లి చేసుకున్న 7 మంది విదేశీ క్రికెటర్లు వీరే..!

FOREIGN CRICKETERS: మాక్స్వెల్ లాగే…భారతీయ మహిళలను పెళ్లి చేసుకున్న 7 మంది విదేశీ క్రికెటర్లు వీరే..!

by Mounika Singaluri

Ads

భారత్ అంటే విదేశీ క్రికెటర్లకు చాలామందికి విపరీతమైన అభిమానం ఉంటుంది. మ్యాచ్ లు ఆడేందుకు భారత్ వచ్చినప్పుడల్లా వారు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. భారత్ లో ఉండే ప్రత్యేకమైన ప్రదేశాలను సందర్శిస్తూ భారత అభిమానులకు ఫోటోలు ఇస్తూ తమ మంచి మనస్సును చాటుకుంటారు. ఐపీఎల్ పుణ్యమా అంటూ డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్లు మన అభిమానులకు చాలా దగ్గర అయ్యారు.వార్నర్ మామ, కేన్ మామ అంటూ పిలుచుకునే అంత అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.ఇండియా తమ సెకండ్ హోమం అని చాలామంది క్రికెటర్లు చాలా సందర్భాల్లో చెప్పారు.

Video Advertisement

అయితే అభిమానం అంతటితో ఆగకుండా చాలా మంది క్రికెటర్లు భారత్ కు చెందిన మహిళలను వివాహం చేసుకున్నారు. ఒకసారి ఆ క్రికెటర్ల లిస్టును మనం పరిశీలిస్తే…

1. షోయబ్ మాలిక్:

ఈ పాకిస్తానీ బ్యాట్స్ మెన్ భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాన్ 2010లో వివాహం చేసుకున్నాడు.
వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే అప్పట్లో వీరి వివాహం కాస్త వివాదం రేపింది.

2.మాక్స్ వెల్:

ఈ ఆస్ట్రేలియన్ బౌలర్ కం బ్యాట్స్ మెన్ భారత సంతతికి చెందిన వీని రామన్ ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

3.హాసన్ ఆలీ:

ఈ పాకిస్తానీ క్రికెటర్ భారత్ కి చెందిన సామియా అర్జు ను 2019లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దుబాయిలో వీరి ప్రేమ మొదలైంది.

4. ముత్తయ్య మురళీధరన్:

ఈ శ్రీలంక స్పిన్ బౌలర్ తమిళనాడుకి చెందిన మది మలార్ ను 2005లో పెళ్లి చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం.

5. షాన్ టైట్:

ఈ ఆస్ట్రేలియన్ బౌలర్ భారత్ కు చెందిన మోడల్ మషుమ్ సింఘాను 2014లో పెళ్లి చేసుకున్నాడు.

6. మోహిన్స్ ఖాన్:

ఈ పాక్ ఆటగాడు బాలీవుడ్ నటి రీనా రాయ్ ను 1983లో పెళ్లి చేసుకున్నాడు. 1990లో వీరు విడిపోయారు.

7.గ్లెన్ టర్నర్:

ఈ న్యూజిలాండ్ మాజీ ఆటగాడు 1973లో భారత్ కి చెందిన సుఖిందర్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 


End of Article

You may also like