Ads
క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్ మెన్ చక్కటి నైపుణ్యంతో రాణించాలి. మంచిగా స్కోర్ చేస్తూ టీం ని కూడా గెలిపిస్తూ ఉండాలి. అయితే చాలా మంది క్రికెటర్లు 200 పరుగులు తీసిన వాళ్ళు ఉన్నారు. బ్రాడ్మన్, కుమార సంగక్కర, బ్రెయిన్ లారా విజయవంతంగా 200 పరుగుల్ని చాలా సార్లు పూర్తి చేశారు. అయితే కొంత మంది క్రికెటర్లు రెండు వందల వరకూ వెళ్ళి 199 పరుగులకే అవుట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇలా అవుట్ అయిన దురదృష్టవంతులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం
Video Advertisement
#1. ముదసిర్ నాజర్:
200 పరుగులు చేయకుండా 199 కే అవుట్ అయిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్. 1984లో ఇండియా టీం తో ఆడుతుంటే 199 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కేవలం ఒకే ఒక్క పరుగు చేస్తే డబుల్ సెంచరీ అయ్యేది కానీ బ్యాడ్ లక్ 199 కి వెనుతిరగాల్సి వచ్చింది.
#2. ఎం అజహరుద్దీన్:
ఈ భారత బ్యాట్స్మెన్ 199 పరుగుల కి 1986లో శ్రీలంకతో ఆడుతున్నప్పుడు స్కోర్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ 199 కి అవుట్ అయ్యారు.
#3. మాథ్యూ ఇలియట్:
ఈ ఆస్ట్రిలియన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ కూడా 199 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ తో ఆడుతున్నప్పుడు ఈ బ్యాట్స్మెన్ 200 పరుగులు పూర్తి చేయకుండా 199 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది.
#4. సనత్ జయసూరియా:
ఈ శ్రీలంక బ్యాట్స్మన్ కూడా 199 పరుగులకే అవుట్ అయ్యారు. 1997 లో ఇండియా టీం తో ఆడుతూ జై సూర్య 199 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒక్క పరుగుతో డబుల్ సెంచరీ అయ్యేది కానీ 199 కి వెనుతిరగాల్సి వచ్చింది.
#5. స్టీవ్ వాహ్:
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ స్టీవ్ అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు చేశారు. కానీ దురదృష్టవశాత్తు వెస్టిండీస్ ఆటగాళ్లతో ఆడుతుంటే డబుల్ సెంచరీ చెయ్యకుండానే 199 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
#6. యూనిస్ ఖాన్:
2006లో ఈ పాకిస్తాన్ క్రికెటర్ ఇండియా టీం తో ఆడుతున్నప్పుడు ఈ బ్యాట్స్మెన్ 199 పరుగులకే అవుట్ అయ్యారు. హర్భజన్ సింగ్ ఈ బ్యాట్స్మన్ ని అవుట్ చేశారు.
#7. ఇయన్ బెల్:
ఈ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎంతో గొప్ప ఆటగాడు. కానీ సౌతాఫ్రికాతో 2008లో 199 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 200 కి కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యారు.
#8. స్టీవెన్ స్మిత్:
వెస్ట్ ఇండీస్ తో ఆడుతున్నప్పుడు ఈ బ్యాట్స్ మెన్ కూడా 200 పరుగులు పూర్తి చెయ్యకుండా 199 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
#9. కెఎల్ రాహుల్:
199 పరుగులు చేసి కెఎల్ రాహుల్ అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ తో ఆడుతున్నప్పుడు రాహుల్ 200 పూర్తి చెయ్యకుండా ఒక పరుగు దూరం లో అవుట్ అయ్యారు.
#10. డీన్ ఎల్గార్:
2017 లో బాంగ్లాదేశ్ తో ఆడుతున్నప్పుడు 199 కె అవుట్ అయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు. కానీ డబుల్ సెంచరీని మాత్రం మిస్ అయ్యారు.
#11. మార్టిన్ క్రొవె:
ఈ ప్లేయర్ ఒక్కరే 299 కి అవుట్ అయ్యారు. శ్రీలంక తో ఆడుతున్నప్పుడు మార్టిన్ 299 పరుగులు చేసి 300 కి కేవలం ఒకే ఒక్క పరుగు దూరం తో వెనుతిరగాల్సి వచ్చింది.
End of Article