Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్‌లో సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి పరిగణించలేదు. గత కొన్ని సంవత్సరాల నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం సురేష్ రైనా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఒకవేళ వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే, సురేష్ రైనాని ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అభిమానులని కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.
Video Advertisement
2008 నుండి 2015 వరకు సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2018 నుండి 2021 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడారు. 205 గేమ్‌లలో 5,528 పరుగులతో IPL చరిత్రలో నాలుగవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు సురేష్ రైనా.
తన ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 4,687 పరుగులు నమోదు చేశారు. దాంతో ఈ సారి సురేష్ రైనాని కొనుగోలు చేయకపోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. ఒక యూట్యూబ్ ఛానల్‌తో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, “గత 12 సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ప్లేయర్స్‌లో సురేష్ రైనా ఒకరు. ఈసారి జట్టులోకి తీసుకోకపోవడం మాకు చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం రైనా ఫార్మ్‌లో లేరు.”
“అంతే కాకుండా ఒక బ్యాలెన్స్‌డ్ టీమ్ ఉండటం కూడా ముఖ్యం. అందుకే సురేష్ రైనా ఈసారి జట్టులో సరిపోరేమో అని అనిపించింది” అని అన్నారు. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ 2022 ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దీపక్ చాహర్‌ను 14 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అలా ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ బౌలర్‌గా దీపక్ చాహర్ నిలిచారు.
End of Article