100వ టెస్ట్‌కి ముందు ఈ 7 “టీం ఇండియా” ప్లేయర్స్ రికార్డ్ ఎంతో తెలుసా..?

100వ టెస్ట్‌కి ముందు ఈ 7 “టీం ఇండియా” ప్లేయర్స్ రికార్డ్ ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

ఇవాళ మొహాలీలో శ్రీలంకతో టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇది విరాట్ కోహ్లీకి ఒక ప్రత్యేకమైన మ్యాచ్ అవ్వనుంది. అందుకు కారణం, విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ పూర్తి చేయడమే. మొహాలీలో విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. కోహ్లీ కంటే ముందు 11 మంది క్రికెటర్లు ఈ ఘనతని సాధించారు. విరాట్ కోహ్లీ 99 టెస్ట్ మ్యాచ్‌లలో 27 సెంచరీలు చేశారు.

Video Advertisement

50.39 యావరేజ్ తో 7962 పరుగులు చేశారు. 99 టెస్ట్ ల తర్వాత మరి కొంతమంది ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ల యావరేజ్ ఎంత, వారు ఎన్ని పరుగులు చేశారో ఇప్పుడు చూద్దాం.

batting performance of indian cricketers after 99 test matches

#1 వీరేంద్ర సెహ్వాగ్

సెహ్వాగ్ 50.84 యావరేజ్ తో 8,448 పరుగులు చేశారు. అందులో 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించారు.

batting performance of indian cricketers after 99 test matches

#2 రాహుల్ ద్రవిడ్

99 టెస్ట్ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ యావరేజ్ 58.16 ఉంది. ద్రవిడ్ 8492 పరుగులు చేశారు. అందులో 22 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

batting performance of indian cricketers after 99 test matches

#3 సునీల్ గవాస్కర్

99 టెస్ట్ మ్యాచ్‌లలో సునీల్ గవాస్కర్ 53.46 యావరేజ్‌తో 8394 పరుగులు చేశారు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి.

batting performance of indian cricketers after 99 test matches

#4 సౌరవ్ గంగూలీ

గంగూలీ 43.17 యావరేజ్ తో 6346 పరుగులు చేశారు. అందులో 15 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

batting performance of indian cricketers after 99 test matches

#5 దిలీప్ వెంగ్‌సర్కార్

దిలీప్ వెంగ్‌సర్కార్ 99 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత 46.21 యావరేజ్ తో 6331 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించారు.

batting performance of indian cricketers after 99 test matches

#6 వివిఎస్ లక్ష్మణ్

వివిఎస్ లక్ష్మణ్ 1999 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత 45.41 యావరేజ్ తో 6313 పరుగులు చేశారు. అందులో 13 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

batting performance of indian cricketers after 99 test matches

#7 సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ 99 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత 57.99 యావరేజ్ తో 8351 పరుగులు చేశారు. అందులో 30 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించారు.

batting performance of indian cricketers after 99 test matches

End of Article

You may also like