అయ్యో జడేజా: చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలకు కారణాలివేనా..?

అయ్యో జడేజా: చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలకు కారణాలివేనా..?

by Sunku Sravan

Ads

ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం రోజురోజుకు వెనుక పడిపోతుంది. వరుస ఓటములతో చతికిల పడుతోంది. ఇప్పటివరకు ఒక్క బోని కూడా కొట్టలేదు. ఆడినటువంటి మ్యాచ్లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్, రెండవ మ్యాచ్ లక్నో సూపర్ జెంట్స్, తాజాగా జరిగిన పంజాబ్ సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటమిపాలైంది. అయితే తదుపరి మ్యాచ్ 9వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడాల్సి ఉంది. మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 181 పరుగులు చేసింది. 32 బంతుల్లో5 ఫోర్లు, 5 సిక్సర్లతో లివింగ్ స్టోన్ సునామీ సృష్టించాడు.

Video Advertisement

 

శిఖర్ ధావన్ 33, జితేష్ శర్మ 26, బ్యాట్ దూసుకుపోవడంతో భారీ లక్ష్యాన్ని చేయగలిగింది. ఈ ముగ్గురు జట్టుకు భారీ స్కోరు అందించారని చెప్పవచ్చు. అయితే చెన్నై బౌలర్ల లో మాత్రం క్రిస్ బోర్డన్ ఒక్కరే పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

chennai 2

ముఖేష్ చౌదరి మళ్లీ తన వైఫల్యాన్ని కంటిన్యూ చేశాడు. 36 పరుగుల తోనే సగం మంది బ్యాటర్లు పెవిలియన్ దారీ పట్టారంటే చెన్నై ఏ విధంగా కూడా ప్రతిఘటించ లేకపోయింది. దీన్ని బట్టి చూస్తే వారు మ్యాచ్ ఎలా వాడారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ గా రాబిన్ ఉతప్ప 13, మోయిన్ అలీ 0, ఋతు రాజు గైక్వాడ్ 1, రవీంద్ర జడేజా 0, అంబటి రాయుడు13 పరుగులతో ఘోరంగా విఫలమయ్యారు. మిడిలార్డర్లో మాత్రం ఎమ్మెస్ ధోనీ 23 పరుగులు, శివం దుబే 50 పరుగులు చేసి చెన్నై పేరును కొంత గాడిలోకి తెచ్చారు. మొత్తానికి 18 ఓవర్లలో 126 పరుగులు చేసి మమ అనిపించారు.0

chennai 1

జడేజా మళ్లీ అదే ఆట..

రవీంద్ర జడేజా మాత్రం ఇంకా గాడిన పడలేదు అని చెప్పవచ్చు. బౌలింగ్ కు మరియు బ్యాటింగ్ లోనూ విఫలమవుతూ వస్తున్నాడు. హర్ష దీప్ సింగ్ 6వ ఓవర్ లో వేసిన మూడో బంతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు పరుగులు 23 మాత్రమే. కొద్ది సేపు కూడా క్రీజ్ లో ఉండలేకపోయారు. బౌలింగ్ లో కూడా అతని ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని చెప్పవచ్చు.

chennai 3

ఓపెనర్లు ఏం చేశారంటే..

చెన్నై ఓపెనర్ల వైఫల్యం కూడా జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. రాబిన్ ఊతప్ప, రుతురాజు గైక్వాడ్ మంచి ప్రదర్శన చేయలేదు. 181 పరుగులు చేయవలసిన దశలో ఓపెనర్లు విఫలం కావడం అంటే.. ఓటమిని మూటగట్టుకున్నట్టే.. గైక్వాడ్ ఈ మ్యాచ్ లో కూడా స్కోర్ చేయలేకపోయాడు. ఓపెనర్ జంట భారీ స్కోరు చేయకపోవడం వల్లే జట్టుకు చాలా మైనస్ జరిగిందని చెప్పవచ్చు.


End of Article

You may also like