9 కోట్లు పెట్టి కొన్నప్పుడు ఫెయిల్ అయ్యి… 90 లక్షలు పలికినప్పుడు స్టార్ అయ్యాడు.! ఆ ప్లేయర్ ఎవరంటే..?

9 కోట్లు పెట్టి కొన్నప్పుడు ఫెయిల్ అయ్యి… 90 లక్షలు పలికినప్పుడు స్టార్ అయ్యాడు.! ఆ ప్లేయర్ ఎవరంటే..?

by Sunku Sravan

Ads

క్రికెట్ లో అరుదైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి స్టార్ ప్లేయర్స్ ఛతికిలా పడితే, చిన్న ప్లేయర్స్ మాత్రమే దూసుకుపోతుంటారు. ఇందులో ఐపీఎల్ చాలా స్పెషల్. ఎప్పుడు ఏ ప్లేయర్ దూసుకుపోతాడో ఎవరూ ఊహించలేరు.

Video Advertisement

అయితే ఈ ప్లేయర్ విషయంలో చాలా విచిత్రం జరిగింది. ఉదాహరణకు బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి. అనేది తనకు తప్పకుండా సూట్ అవుతుంది. మరి ఆయనెవరో తెలుసుకుందామా..? దేశవాళీ టోర్నీలో అద్భుతంగా ఆడటంతో 2021 ఐపీఎల్ సీజన్ లో కృష్ణప్ప గౌతమ్ ను చెన్నై సూపర్ కింగ్స్ 9.25 కోట్ల రూపాయలతో సొంతం చేసుకుంది.

ఈయన 2018 నుండి 2020 వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అప్పుడు అతనిని 6.20కోట్ల రూపాయలతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2018 నుండి 2020 వరకు ఆయన పర్ఫామెన్స్ అంతగా లేకపోవడంతో కృష్ణప్ప గౌతమ్ ను రాజస్థాన్ జట్టు రిమూవ్ చేసింది. దీంతో అతను 2021లో జరిగినటువంటి మినీ వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్ ఆక్షన్ లోకి వచ్చేసారు. ఈ క్రమంలో అతగాడిని సొంతం చేసుకోవడం కోసం పంజాబ్ సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. ఫైనల్ గా అతన్ని 9.25 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై. దీంతో అతను అత్యధిక ధర పలికిన ప్లేయర్ అయిపోయాడు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గౌతమ్ చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులోకి తీసుకోలేదు. పూర్తిగా బెంచ్ కే పరిమితమై పోయాడు. ఒక్కసారి సబ్స్టిట్యూట్ గా మైదానంలోకి వచ్చి క్యాచ్ జారవిడిచాడు. దీని అనంతరం మెగా వేలం వచ్చింది. ఈసారి ఇతగాడిని ఎవరు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కృష్ణప్ప కేవలం 90 లక్షల రూపాయల ధర మాత్రమే పలికాడు. గతంతో పోలిస్తే 90% తగ్గింది. ఇతడిని లక్నో జట్టు సొంతం చేసుకుంది.

కానీ కృష్ణప్ప గౌతమ్ ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో వికెట్ తీసిన కృష్ణప్ప.. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఒక్క ఓవర్ లో దేవదత్ పడక్కల్.. వాన్ డర్ డుస్సేను వికెట్స్ తీశాడు. ఇక పాండ్యా కనుక హైట్ మైర్ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం మ్యాచ్ లో మూడు వికెట్లు సాధించేవాడు. కానీ కృనాల్ క్యాచ్ మిస్ చేయడంతో అది సాకారం కాలేదు. 9.25 కోట్లు పలికినప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడని కృష్ణప్ప.. 90 లక్షలకు అమ్ముడుపోయి జట్టుకు లక్కీ ప్లేయర్ గా మారడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈయన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like