Ads
ముంబై ఇండియన్స్ మళ్ళీ ఓడింది. పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 194 పరుగుల చేధనలో యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49,25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు), తిలక్ వర్మ (36,20 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్స్ లు) ధనాధన్ ఇన్నింగ్స్ లతో మెరిసినా.. సీనియర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్ శర్మ (28,17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు ), ఇషాన్ కిషన్ (3),కీరన్ పొలార్డ్ (10) దారుణంగా విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (43,30 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లు ) డెత్ ఓవర్లలో ఒంటరి పోరాటం చేసినా..మరో ఎండ్ నుంచి సహకారం కొరవడింది. ముంబై ఇండియన్స్ గెలుపు దిశగా సాగుతున్న తరుణంలో తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్ రనౌట్ కావడం ముంబై ఇండియన్స్ ని గట్టిగా దెబ్బతీసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు ముంబై ఇండియన్స్ 186 పరుగలే చేయగలిగింది.
Video Advertisement
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52,32 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ లు ), శిఖర్ ధావన్ (70,50 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్స్ లు) అర్థ శతకాలతో 198 పరుగుల భారీ స్కోర్ అందించారు. జితేష్ శర్మ(30 నాటౌట్, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు ), షారుక్ ఖాన్ (15,6 బంతుల్లో 2 సిక్స్ లు) ఆకట్టుకున్నారు. టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఏది కలిసి రాలేదు. వరుస పరాజయాల వేదన లో ఉన్న రోహిత్ సేనకు పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు గట్టి పంచ్ ఇచ్చారు. ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (50) అర్థ సెంచరీతో మెరిశాడు.
6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన మయాంక్ 30 బంతుల్లోనే 50 మార్క్ అందుకున్నాడు. పవర్ ప్లే లో చెలరేగిన మయాంక్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. మయాంక్ ధాటికి 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 65/0 తో పటిష్టంగా నిలిచింది. మరో ఎండ్ శిఖర్ ధావన్ (70) నెమ్మదిగా ఆడాడు. మయాంక్ కు చక్కటి సహకారం అందించిన శిఖర్ ధావన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 బంతుల్లో అర్ధసెంచరీ నమోదు చేశాడు. జానీ బెయిర్ స్టో(12), లియాం లివింగ్ స్టోన్ (2) నిరాశపరిచినా.. దేశవళీ సంచలనాలు జితేష్ శర్మ (30 నాటౌట్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు), షారుక్ ఖాన్ (15,6 బంతుల్లో 2 సిక్స్ లు) కదం తొక్కారు. డెత్ ఓవర్లలో ఈ ఇద్దరి దూకుడుతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బసిల్ తంపీ, జైదేవ్, టైమల్ మిల్స్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article