IPL 2022 : “పంజాబ్”పై DC గెలవడంపై… ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!

IPL 2022 : “పంజాబ్”పై DC గెలవడంపై… ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ బౌలర్లు అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్,లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్ ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ జట్టు 115 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ ఓపెనర్లు పృద్వి షా, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పృథ్వీ షా(41) ఔటైనా,వార్నర్ (60 నాటౌట్ ), సర్పరాజ్ (13 నాటౌట్) మిగతా పని కానిచ్చారు.

Video Advertisement

దీంతో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడుతూ ఆడింది. శిఖర్ ధావన్ (9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ ఔట్ చేయడంతో పంజాబ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కెప్టెన్ మయాంక్ అగర్వాల్( 22) మరోసారి నిరాశపరిచాడు.

విదేశీ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో (9), లియామ్ లివింగ్ స్టన్ (2)కూడా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కాసేపు జట్టును ఆదుకున్న జితేష్ శర్మ (32)ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ విజృంభించి.. ఒకే ఓవర్లో రబడా(2), నాథన్ ఎలిస్(0)ను పెవిలియన్ చేర్చాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లోని ఏకైక సిక్సర్ బాదిన రాహుల్ చాహర్ (12)ను కూడా లలిత్ యాదవ్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అర్ష దీప్ సింగ్ (9)రనౌట్ అవ్వడంతో పంజాబ్ ఆలౌట్ అయింది. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

trending trolls on dc winning over pbks in ipl 2022

ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్,అక్షర్ పటేల్,కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఫామ్ లో ఉన్న ఓపెనర్లు పృథ్వీ షా (41) ను రాహుల్ చాహర్ అవుట్ చేశారు. దీంతో వార్నర్ పృథ్వీషా కలిసి తొలి వికెట్ కు 6.3 ఓవర్లలో 83 పరుగులు జత చేశారు. వార్నర్ (60 నాటౌట్ ; 30 బంతుల్లో 10 ఫోర్లు,3 సిక్సర్లు), సర్పరాజ్ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12


End of Article

You may also like