Ads
సోమవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సీజన్ లో రిషి ధావన్ మొదటిసారి ఆడారు. ఆయన 2016 తర్వాత మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ ఆట ఆడారు. 2013లో క్యాచ్ రీచ్ లీగ్ లో అరంగేట్రం చేసిన రిషి ధావన్ పంజాబ్ కింగ్స్ తరఫున కూడా చివరి సారి ఆడారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు రిషి ధావన్ రంజీ ట్రోఫీలో ఆడారు. అయితే రెండవ రౌండ్ సమయంలో అతని ముఖానికి దెబ్బ తగిలింది.
Video Advertisement
దీంతో ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుని PBKS కొరకు కూడా మొదటి నాలుగు మ్యాచుల్లో అందుబాటులో లేడు. దెబ్బ తగిలిన తర్వాత అతని ముక్కు శస్త్రచికిత్స జరిగింది. దీంతో దాన్ని రక్షించుకోవడానికి అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో మాస్క్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అలాగే నెట్ ప్రాక్టిస్ లో కూడా అతను ఆ మాస్కు ధరించి ఉన్నారు.
CSK తో ఆడటానికి ముందు PBKS తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టును విడుదల చేసింది. దీంతో రిషి ధావన్ IPL ప్రారంభంలో ఆడక పోవడానికి కారణన్ని వెల్లడించారు. దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత రిషి ధావన్ 27 వ ఐపీఎల్ మ్యాచ్ ఆడారు. ఐపీఎల్ మెగా వేలంలో PBKS అతన్ని 55 లక్షలకు దక్కించుకుంది.
End of Article