Ads
ఐపీఎల్ ఈ సీజన్లో కెప్టెన్ రవీంద్ర జడేజా పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగా లేదని దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరొక పరాజయం పాలైందని తెలుస్తోంది. సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 176/6 పరిమితమైంది..
Video Advertisement
లక్ష్యఛేదనలో అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ రవీంద్ర జడేజా ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వలేదని చెప్పవచ్చు ముఖ్యంగా ఆ రెండు ఓవర్లలో అతను నిర్లక్ష్యం వ్యవహరించిన తీరు వల్లే మ్యాచ్ నీరుగారి పోయిందని అంటున్నారు. వాస్తవానికి అంబటి రాయుడు తన యొక్క పవర్ హిట్టింగ్ స్కిల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ని తిరుగులేని స్థితిలో నిలిపాడు.
పంజాబ్ బౌలర్లపై ఎదురు దాడి చేశారు రాయుడు. భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో శర్మ బౌలింగులో 6,6,6,4 వరుసగా కొట్టేశాడు. దీంతో ఒకే ఓవర్లో 23 పరుగులు వచ్చాయి.. ఈ దెబ్బకి చెన్నై గెలుపు కూడా 24 బంతుల్లో 47 పరుగులు తేలికగా మారింది. అప్పటికే రాయుడు 33 బంతులలో 75 పరుగులు చేస్తే, జడేజా ఏడు బంతుల్లో నాలుగు పరుగులు చేశారు.
17వ ఓవర్ కి వచ్చేసరికి హర్షదీప్ బౌలింగ్.. జడేజా 3 బంతులు ఆడి కేవలం మూడు పరుగులు చేపట్టాడు. ఇంకోవైపు అంబటి అలసిపోయినట్లు కనిపించారు. వికెట్ల మధ్య పరుగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఈ తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన జడేజా సింగిల్స్ తో సరిపెట్టాడు. 13 ఓవర్ కి వచ్చేసరికి క్రిజు లోకి వచ్చినటువంటి జడేజా చివరి వరకు ఉండి కొట్టింది ఒక ఫోర్, సిక్స్ మాత్రమే.
ఆ సిక్స్ కూడా చివరి ఓవర్లో ఐదో బంతి కొట్టారు. ఇంకోవైపు రాయుడు భారీ షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నిస్తున్నా జడేజా మాత్రం ఏ మాత్రం ఆడ లేకపోయారు. సీజన్లో కెప్టెన్సీ బాధ్యత కారణంగా చాలా జాగ్రత్తగా ఆడుతూ సింగిల్స్ తోనే సరిపెట్టుకుంటున్నాడు. ఆఖరి ఫ్లాగ్ ఓవర్లో కూడా ఆయన ఆడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ప్రభావం జట్టు పై తీవ్రంగా పడింది.
End of Article