గుజరాత్ తో హైదరాబాద్ మ్యాచ్ లో చివరి ఓవర్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన “శశాంక్ సింగ్” ఎవరు.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి.?

గుజరాత్ తో హైదరాబాద్ మ్యాచ్ లో చివరి ఓవర్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన “శశాంక్ సింగ్” ఎవరు.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి.?

by Megha Varna

Ads

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ మ్యాచ్లు జోరుగా జరుగుతున్నాయి. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయ్యింది. అయితే ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడా తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Video Advertisement

196 పరుగుల లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టింది. రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా అద్భుతమైన బ్యాటింగ్ చేయగా గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ గెలిచింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినా సరే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు సన్రైజర్స్ బ్యాట్స్ మ్యాన్ శశాంక్ సింగ్. చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు శశాంక్ సింగ్. దీంతో శశాంక్ సింగ్ పైనే అందరి చూపు పడింది. మొత్తం శశాంక్ సింగ్ 6 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ సహా 25 పరుగులు తీసాడు.

195 పరుగుల భారీ స్కోరు చేసారంటే శశాంక్ సింగ్ కూడా ముఖ్యమైన రోల్ ప్లే చేసాడు. ఈ బ్యాట్స్ మ్యాన్ ఐదు మ్యాచ్‌ల నుంచి జట్టులో ఉన్నప్పటికి బ్యాటింగ్ చేసే అవకాశం రానే లేదు. కానీ ఫైనల్ గా గుజరాత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ రావడం.. ఆ అవకాశాన్ని వినియోగించుకుని తాను ఏమిటో చూపించాడు శశాంక్ సింగ్. ఫెర్గూసన్‌ వేసిన 20వ ఓవర్‌ ఐదో బంతిని ఫైన్‌లెగ్‌ దిశగా సిక్స్‌ కొట్టడం హైలెట్ అనే చెప్పాలి.

ఇక ఇంతకీ ఈ ప్లేయర్ ఎవరు అన్నది చూస్తే.. మంచి స్ట్రైక్‌ రొటేట్‌ చేయగల బ్యాట్స్ మ్యాన్ శశాంక్‌ సింగ్‌. 2015లో ముంబై తరపున డొమొస్టిక్‌ క్రికెట్‌లో ఆడడం మొదలు పెట్టాడు. అలానే అదే ఏడాది టి20, లిస్ట్‌- ఏ క్రికెట్‌ లో ఆడడం మొదలు పెట్టాడు. 2017 నుంచి IPL లో వున్నాడు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు లో ఉండేవాడు. 2019, 2020 సీజన్‌లో అయితే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో ఉన్నాడు. ఈసారి రూ.20 లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

 

 

 


End of Article

You may also like