Ads
ధోని బ్యాటింగ్ చేసేముందు బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఆయన బ్యాట్ కొరకే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు బ్యాట్ ఎందుకు కొరుకుతాడో దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఓ సారి చూద్దాం..!
Video Advertisement
ధోని బ్యాటింగ్ వచ్చే ముందు తన యొక్క బ్యాట్ ను ఎందుకు నోట్లో పెట్టుకుంటాడో అమిత్ మిశ్రా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మహేంద్రసింగ్ ధోని తన బ్యాట్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటాడు.
కాబట్టి మైదానంలోకి వచ్చేముందు బ్యాట్ పై ఉన్న టేప్ లేదా త్రెడ్ లాంటివి ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తాడు. బ్యాట్ ను శుభ్రం చేసుకున్న తర్వాతే మైదానంలోకి అడుగు పెడతాడని అమిత్ మిశ్రా తెలియజేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం రోజు జరిగే మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎనిమిది బంతుల్లోనే 21 పరుగులు చేశారు.. అప్పటివరకు 200 లోపు స్కోర్ చేసేట్టు కనిపించిన చెన్నై జట్టు చివరికి ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది.
దీని అనంతరం లక్ష్యసాధనలో ఢిల్లీ జట్టు 17.4 ఓవర్లలో 117 పరుగులు చేసి అవుట్ అవగా.. చెన్నై జట్టు 97 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నెంబర్ 5 లో బ్యాటింగుకు దిగిన ధోని.. రెండో బంతికి సిక్స్, మూడవ బంతికి ఫోర్ కొట్టాడు. మిచెల్ మార్స్ బౌలింగ్ లో క్రిజ్ వెలుపలికి వెళ్లి లాంగ్ ఆన్ దిశలో ధోని సిక్స్ కొట్టడం చాలా ఆసక్తి కరంగా మారింది. అయితే ఆ బంతిని క్యాచ్ గా మలిచేందుకు డేవిడ్ వార్నర్ బౌండరీ లైన్ వద్ద ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.
End of Article