Ads
ఐపీఎల్ సీజన్ 2022 లో ముంబై,చెన్నై జట్టు దారుణంగా విఫలమయ్యాయి. అయితే చెన్నై ఎలాగొలా ప్లే ఆఫ్స్ అవకాశాన్ని దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరి పోరులో రోహిత్ సేనా సిఎస్కే ను దారుణంగా దెబ్బతీసింది. వాంఖడే స్టేడియం వేదికగా సాగిన పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సిఎస్కే 16 ఓవర్లలో కేవలం 97/10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Video Advertisement
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 14.5 ఓవర్లలోనే 103-5 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని నమోదు చేసింది. కీలక మ్యాచ్ లో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. గెలవాల్సిన మ్యాచ్ ను చేతులారా చేజార్చుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సీఎస్కే జట్టు కోల్పోయింది.
టోర్నీ ఆరంభం నుంచి పడుతూ లేస్తూ వచ్చిన సీఎస్కే జట్టు ఈ ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ అనుకోకుండా ముంబై జట్టు దెబ్బతీయడం తో ఈసారి ఫైనల్ చేరకుండానే చెన్నై నిష్క్రమించింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
End of Article