Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఈ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇందులో కేవలం ఆరు మ్యాచ్ లే ఉండగా..3ప్లే ఆఫ్స్ బేర్తుల కోసం 7 జట్ల మధ్య పోటీ ఉన్నది. ఇంకా ఎప్పటి లాగే ఈ సీజన్ లో కూడా చాలా గొప్పగా ప్రారంభించిన బెంగళూరు ఆ తర్వాత గాడి తప్పి ప్లేఆఫ్ అవకాశాలను చాలా ఇబ్బందిగా మార్చుకుంది. 14 పాయింట్లు సాధించి ప్రస్తుతం ఐదవ స్థానంలో కొనసాగుతోంది. గురువారం గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో విజయాన్ని సాధించి.. దీని అనంతరం ఢిల్లీ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Video Advertisement
పంజాబ్ జట్టుతో ఆడి ఓడిన తర్వాత కొంత విరామం లభించింది ఆర్సిబి జట్టుకు.. ఈ సమయంలో తమ టీంలో ఆడినటువంటి ఇద్దరూ ప్లేయర్లను “హాల్ ఆఫ్ ఫేమ్” అవార్డుతో ఆర్సిబి గౌరవించింది.. ఇందులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ 11, క్రిస్ గేల్ ఏడు సంవత్సరాలు ఆర్సిబి తరుపున ఆడారు. వీరి సమయంలో జట్టుకు చాలా విజయాలు అందించారు. అయితే వీరిని ప్రస్తుతం బెంగళూరు టీం “హాల్ ఆఫ్ ఫేమ్” అవార్డుతో గౌరవించింది.
ఈ కార్యక్రమానికి క్రిస్ గేల్, డివిలియర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వగా ముంబై నుంచి బెంగళూరు టీం మొత్తం అటెండ్ అయింది. ఈ సందర్భంలో కోహ్లీ సేవల గురించి కూడా మాట్లాడారు . దీని అనంతరం హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఆహ్వానిస్తున్నట్టు కోహ్లీ తెలియజేశారు. కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో గేల్, డివిలియర్స్ భావోద్వేగానికి గురయ్యారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో నెటిజన్స్ డేవిడ్ వార్నర్ విషయాన్ని బయటకు తీశారు. 2016లో జట్టును ఛాంపియన్ చేసిన డేవిడ్ వార్నర్ ను హైదరాబాద్ జట్టు చాలా అవమానించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2021 సీజన్లో కొన్ని మ్యాచులు బెంచ్ కే పరిమితమయ్యారు వార్నర్. దీని అనంతరం అతన్ని బయటకు పంపింది. వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ తరఫున అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ జట్టు చివరి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆప్ కు చేరుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలో చాలామంది ఆర్ సిబి ని చూసి నేర్చుకోవాలని కొంతమంది అభిమానులు ఇన్ డైరెక్ట్ గా సన్రైజర్స్ హైదరాబాద్ కు చురకలంటించారు.
End of Article