బెంగళూరు జట్టుకు ఆ తప్పిదం కలిసొచ్చిందా.. ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టర్న్..?

బెంగళూరు జట్టుకు ఆ తప్పిదం కలిసొచ్చిందా.. ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టర్న్..?

by Sunku Sravan

Ads

లక్నోతో బుధవారం రోజు రాత్రి జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు చేసిన చిన్న తప్పిదం చాలా కలిసొచ్చింది. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

Video Advertisement

లక్ష్యఛేదనలో లక్నో టీం విజయ తీరాలకు వెళ్లాలంటే 12 బంతుల్లో 33 పరుగులు చేయాలి. ఈ దశలోనే క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ (79:58 బంతుల్లో 3/4,5/6), ఎవిన్ లావీస్ 2 నాటౌట్ ) చాలా దూకుడుగా ఆడి కనిపించారు.

కానీ 19వ ఓవర్ లో దినేష్ చేసినటువంటి చిన్న తప్పిదం కారణంతో స్ట్రైకింగ్ కి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత బాల్ కే అవుటయ్యారు.. దీంతో బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బంతిని స్లో డెలివరీ చేశాడు. దీన్నీ గమనించ లేకపోయినా ఎవిన్ లావిస్ బ్యాట్ అడ్డంగా ఊపాడు. అయితే అతని బ్యాట్ కు దొరకని బాల్ దినేష్ కార్తీక్ ముందు పడింది.

దీంతో సింగిల్ కు కేఎల్ రాహుల్ పరిగెత్త గా.. ఊహించలేని దినేష్ కార్తీక్ ఒక గ్లోవ్స్ తీసేసి చాలా వేగంగా బంతిని బౌలర్ కి విసిరాడు.. కానీ హెజిల్ ఆ బాల్ ను అందుకని నాన్ స్ట్రైక్ రనౌట్ చేయలేకపోయాడు. మ్యాచ్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ కీపర్ ఒక గ్లోవ్ తీసేసి.. రనౌట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.. దీంతో బ్యాటరులు బైస్ కొరకు పరిగెత్తే సాహసం అయితే చేయరు. కానీ ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఏమరా పాటుతో వ్యవహరించారు. కానీ రాహుల్ చాన్స్ తీసుకున్నాడు. ఇదే బెంగళూరుకు కలిసొచ్చింది.

 

ఆ సింగిల్ తో స్ట్రైక్ కి వచ్చిన రాహుల్.. హేజిల్ వుడ్ విసిరిన లో యార్కర్ బాల్ ను స్కూఫ్ చేయబోయి షాబాజ్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన బంతిలో పాండ్య గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ రనౌట్ నుంచి తప్పించుకొని చివరిదాకా లావిష్ క్రీజులో ఉన్న ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఒకవేళ కె.ఎల్.రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.


End of Article

You may also like