Ads
ఈసారి కప్పు మనదే అంటూ ప్రతిసారి చెప్పే బెంగళూరు జట్టు.. ఎప్పటిలాగానే ఈ సీజన్ లో కూడా తన కలను నెరవేర్చుకోలేకపోయింది. కీలక మ్యాచ్ లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో రాణించలేక టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచిపోయింది. మరోవైపు రాజస్థాన్ దర్జాగా ఫైనల్ కు చేరుకుంది. ఓపెనర్ బట్లర్ అజేయ శతకంతో చెలరేగి జట్టును రాజసంగా తుది పోరులో నిలబెట్టారు. 2008 టైటిల్ నెగ్గిన తర్వాత తొలిసారిగా ఫైనల్ కు చేరుకున్న రాజస్థాన్ 14 సంవత్సరాల కళకు అడుగు దూరంలో నిలిచింది.
Video Advertisement
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ తో తలపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరును రాజస్థాన్ 157/8స్కోర్ కే పరిమితం చేసింది.
రజత్ పాటిదర్ (58) మినహా బ్యాటర్లు తేలిపోవడంతో బెంగుళూరు రాజస్థాన్ ముందు మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఛేజింగ్ లో బట్లర్ (106) సెంచరీతో చెలరేగగా రాజస్థాన్ సునాయాస విజయం సాధించింది.18.1 ఓవర్లు ఆడిన రాజస్థాన్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ ఫైనల్ కు చేరుకుంది. 2008 తొలి సీజన్ లో టైటిల్ గెలిచిన తర్వాత రాజస్థాన్ ఫైనల్ కు చేరుకోవడం ఇదే తొలిసారి. సెంచరీ చేసిన బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#27
#28
#29
#30
End of Article