IPL 2022: ఈ విషయంలో “శుభ్‌మన్ గిల్” విరాట్ కోహ్లీని కాపీ కొట్టాడా..? వైరల్ అవుతున్న కామెంట్స్..!

IPL 2022: ఈ విషయంలో “శుభ్‌మన్ గిల్” విరాట్ కోహ్లీని కాపీ కొట్టాడా..? వైరల్ అవుతున్న కామెంట్స్..!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ సిక్సర్ కొట్టిన అనంతరం శుబుమన్ గిల్ సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా లేవు.

Video Advertisement

రాజస్థాన్ బౌలర్ మేక్ కామ్ బౌలింగులో డీప్ స్క్వేర్ లెగ్ సైడ్ సిక్స్ కొట్టటంతో గుజరాత్ టైటాన్స్ గెలుపు సొంతమైంది. ఈ గెలిచిన సంబరంలో గిల్ అచ్చం విరాట్ కోహ్లీలాగే సెలబ్రేట్ చేసుకున్నారు.

కోహ్లీ విన్నింగ్ షాట్స్ పుట్టినప్పుడు గాని, సెంచరీలు చేసినప్పుడు హెల్మెట్ తీసేసి.. బాడీ ని కాస్త వెనకకు వంచి కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. అయితే గిల్ కూడా ఆ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఆయన సెలబ్రేషన్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే శుబు మాన్ హెల్మెట్ తీసేసి సింహంలా గర్జించాడు. అనంతరం అవతల ఉన్నటువంటి తన సహచరుడు మిల్లర్ ను కౌగిలించుకుని వేడుకలు జరుపుకున్నాడు.

ఈ మ్యాచ్ లో గిల్ మాత్రం అద్భుతంగా ఆడాడు అని చెప్పవచ్చు. 43 బంతుల్లో 45 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. హార్థిక్ పాండ్యాతో జత కట్టి మూడో వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీని అనంతరం డేవిడ్ మిల్లర్ (19/32)తో కలిసి మ్యాచ్ అయిపోయే వరకు క్రిజ్ లో నిలబడ్డాడు. వీరిద్దరు కలిసి మ్యాచ్ విన్నింగ్ కోసం (29/47) పరుగులు చేశారు.

లైఫ్ ఇచ్చిన చాహల్ :
131 పరుగుల చిన్న లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగినటువంటి గుజరాత్ కు శుభారంభం మాత్రం దక్కలేదు. బౌన్సీ పీచ్ కావడంతో వేసిన బంతులు ఎక్స్ట్రా బౌన్స్ అవుతూ బ్యాటర్లకు సరైన అంచనా లేకుండా ఉన్నాయి. ఈ సందర్భంలోనే బౌల్ట్ వేసిన మొదటి ఓవర్లో గిల్ ఇచ్చిన క్యాచ్ చాహల్ నేలపాలు చేశారు. ఇలా గోల్డెన్ అకౌంట్ నుండి తప్పించుకున్న గిల్ ఇచ్చిన లైఫ్ ను సద్వినియోగం చేసుకున్నారు. ఇలా చివరి వరకు క్రీజులో ఉండి చివరికి విన్నింగ్ షాట్ కొట్టేశారు.

https://twitter.com/AkshatOM10/status/1530977937897705473?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1530977937897705473%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.mykhel.com%2Fcricket%2Fipl-2022-final-shubhman-gill-celebrates-in-kohli-style-after-hitting-a-match-winning-six-in-final-041840.html


End of Article

You may also like