లైఫ్/కెరీర్ లో ఫెయిల్ అయినప్పుడు… “దినేష్ కార్తీక్” కి తోడుగా ఉన్న ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.?

లైఫ్/కెరీర్ లో ఫెయిల్ అయినప్పుడు… “దినేష్ కార్తీక్” కి తోడుగా ఉన్న ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ధోనికి రెండో వికెట్ కీపర్ గా, తమిళనాడు టీంకి కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. దినేష్ కార్తీక్ టీం మేట్ అయిన మురళీ విజయ్ దినేష్ కార్తీక్ భార్యతో రిలేషన్ లో ఉన్నారు. ఈ విషయం దినేష్ కార్తీక్ కి తప్ప తమిళనాడు రంజీ టీం మొత్తానికి తెలుసు.

Video Advertisement

ఒకరోజు దినేష్ కార్తీక్ భార్య మురళీ విజయ్ బిడ్డతో తను గర్భవతిగా ఉన్నట్టు, తనకి దినేష్ కార్తీక్ నుండి విడాకులు కావాలి అని చెప్పింది. వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మురళీ విజయ్, దినేష్ కార్తీక్ భార్యతో కలిసి ఉన్నారు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, టీమ్ ఇండియాకి ఓపెనర్ గా ఉన్నారు.

inspiring story of dinesh karthik

దినేష్ కార్తీక్ అప్పుడు చాలా కుంగిపోయారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ ప్రభావం దినేష్ కార్తీక్ ఆట మీద కూడా పడింది. రంజీ మ్యాచ్ లలో ఓడిపోయారు. కెప్టెన్సీ కూడా పోయింది. ఐపీఎల్ లో కూడా ఆశించిన విధంగా ఆడలేకపోయారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. జిమ్ కి వెళ్లడం కూడా మానేశారు. అలాంటి సమయంలో దినేష్ కార్తీక్ ట్రైనర్ ఇంటికి వెళ్లి దినేష్ కార్తీక్ ని చూశారు. అప్పుడు దినేష్ కార్తీక్ చాలా పాడైపోయి ఉన్నారు. ట్రైనర్ దినేష్ కార్తీక్ తో మళ్ళి జిమ్ కి వెళ్ళడం మొదలు పెట్టమని చెప్పారు.

player who helped dinesh karthik during his tough times

అయితే దినేష్ కార్తీక్ ఇలా ఉన్న సమయంలో తనకి రంజీ ప్లేయర్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ సహాయ కోచ్ ఆయన అభిషేక్ నాయర్ చాలా సహాయం చేశారు అని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న దినేష్ కార్తిక్ కి అభిషేక్ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అలాగే దినేష్ కార్తీక్ ఆటతీరు మెరుగుపరచడంలో కూడా అభిషేక్ నాయర్ చాలా సహాయం చేశారు. ఈ విషయం గురించి దినేష్ కార్తీక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “కోచ్ గా అభిషేక్ నాయర్ 12 సంవత్సరాల క్రితమే కలిసి ఉంటే బాగుండేది” అని చెప్పారు. అలాగే దినేష్ కార్తీక్ భార్య అయిన దీపికా కూడా దినేష్ కార్తీక్ మానసిక సమస్యల నుండి బయటకి రావడానికి చాలా సహాయం చేశారు.

దినేష్ కార్తీక్ కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి కాల్ వచ్చింది. అప్పుడు ధోని, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా ఉండాలి అనుకున్నారు. 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దినేష్ కార్తీక్ ని దక్కించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దినేష్ కార్తీక్ ని కొనుగోలు చేసింది. దినేష్ కార్తీక్ కూడా RCB కోసం కీలకమైన మ్యాచ్‌లను ఆడారు. ఇప్పుడు రిటైర్ అయిన ఎంఎస్ ధోని స్థానంలో స్థానంలో ఫినిషర్‌గా T20 వరల్డ్ కప్ జట్టులోకి రావాలని అనుకుంటున్నారు.

Also read: “మురళి విజయ్”తో ఎఫైర్ పెట్టుకొని భర్తకు విడాకులు… “దినేష్ కార్తీక్” గురించి ఇది తెలిస్తే రియల్ హీరో అంటారు.!


End of Article

You may also like