T20 లో అలా ఉండదు కాబట్టే “సూర్య” టాప్-1 అయ్యాడా? 2 వన్డేలలో కూడా అలా అయ్యేసరికి?

T20 లో అలా ఉండదు కాబట్టే “సూర్య” టాప్-1 అయ్యాడా? 2 వన్డేలలో కూడా అలా అయ్యేసరికి?

by kavitha

Ads

Suryakumar Yadav: టీ20 క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నాడు. అయితే అతను వన్డే మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. దీనిపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కామెంట్స్ చేశాడు.

Video Advertisement

ఇటీవలే టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటనను ముగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. అయితే వన్డే సిరీస్‌లో ఇండియా 0-1 తేడాతో సిరీస్‌ ను కోల్పోయింది. టీ20 లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ తుఫాన్ లాంటి బ్యాటింగ్ తో అది సిరీస్ గెలుపులో కీలకమైన  పాత్ర వహించాడు. అంతేకాక టీ20లో టాప్1 గా నిలిచాడు. అలాంటి సూర్యకుమార్ వన్డే మ్యాచ్‌కి వచ్చేసరికి ఆడలేకపోయాడు.న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 306 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ పెద్ద ఇన్నింగ్స్‌లు చేయలేదు.ఇక రెండవ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. మూడో వన్డేలో సూర్యకుమార్ నెమ్మదిగా మొదలు పెట్టి, కొన్ని షాట్లు ఆడినా అంతగా ఆడలేకపోయాడు. దాంతో టీ20లో బాగా ఆడిన సూర్యకుమార్ వన్డే మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని మాజీ క్రికెటర్స్ పేర్కొంటున్నారు. ఈ కారణం వల్లనే సూర్యకుమార్ కి టెస్టు ఆడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు.ఇక వసీం జాఫర్ ఏమన్నారంటే, టీ20 క్రికెట్‌లో ఫీల్డర్‌ను ఎప్పుడూ స్లిప్‌లో ఉంచరని, అందువల్ల ఫీల్డర్ క్యాచ్ అవుట్ కాలేదని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. వన్డేలలో మరియు టెస్ట్ క్రికెట్‌లో కొన్నిసార్లు ఒకటి, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఫీల్డర్లు స్లిప్‌లో ఉంచబడతారు. అప్పుడే చేసే చిన్న పొరపాటు కూడా ఔట్ అవ్వడానికి దారితీస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలాగే మూడో వన్డేలో కూడా స్లిప్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాటల ప్రకారం సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లలో రాణించాలంటే తన బ్యాటింగ్ ను ఇంకా మెరుగుపరచుకోవాలి.


End of Article

You may also like