వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో విజేతకు ఇచ్చే “గద” వెనుక ఉన్న… కథ ఏంటో తెలుసా..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో విజేతకు ఇచ్చే “గద” వెనుక ఉన్న… కథ ఏంటో తెలుసా..?

by kavitha

Ads

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్. భారత్ – ఆస్ట్రేలియా ఇరు జట్ల క్రికెటర్లు అమీతుమీ తేల్చుకోవడానికి సీద్దం అవుతున్నారు. ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధించి ఓవల్‌లో ‘గద’ అందుకునేది ఎవరు అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

దాదాపు ఏ సిరీస్ లో విజయం సాధించిన ఆ జట్టుకు సాధారణంగా ట్రోఫిని అందచేస్తూ ఉంటారు. అయితే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో విజయం సాధించినవారికి మాత్రం ‘గద’ ను అందచేస్తారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..
రెండి సంవత్సరాలకు ఒకసారి ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ జూన్ 7న (బుధవారం) నుండి  మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ గ్రౌండ్ సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరి ఈ  ఓవల్‌లో ‘గద’ అందుకునే జట్టు ఏది అని అందరు చూస్తున్నారు. క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుతం టీ20 దే హవా నడుస్తోంది. జెంటిల్మన్‌ గేమ్‌కు అసలు రూపం అంటే టెస్ట్‌. ఈ టెస్ట్‌ మ్యాచ్ లకు పాపులారిటీ తీసుకురావడం కోసం ఐసీసీ చేసిన ఆలోచనే డబ్ల్యూటీసీ. ఇది 2019-21లో మొదలైంది.
ఇప్పుడు జరుగబోయేది డబ్ల్యూటీసీలో రెండో సీజన్‌. గెలిచిన జట్టుకు అందచేసే గదను ఇంగ్లండ్‌ లోని థామస్‌ లైట్‌ తయారు చేసింది. క్రికెట్‌లో ముఖ్యమైన బంతిని కేంద్ర బిందువుగా చేసి, గదను తయారు చేసింది. దీనికి బంగారు పూత ఉన్న బంతిని అమర్చింది. బంతి అమరిక టెస్ట్‌ క్రికెట్‌ అంతర్జాతీయ స్థాయిని తెలుపుతుంది. గద యొక్క హ్యాండిల్‌ క్రికెట్‌ స్టంప్‌ ను సూచిస్తుంది. హ్యాండిల్‌ కి రిబ్బన్‌ ఉన్నగెలుపుకు చిహ్నంగా భావిస్తారు.
ఈ గదను ముందుగా డిజైన్‌ చేసింది మాత్రం ట్రోఫీ డిజైనింగ్‌ కంపెనీ ట్రెవర్‌ బ్రౌన్‌. గద రూపకల్పనకు ప్రేరణ ఇచ్చింది ఏమిటనేది బ్రౌన్‌ తెలిపారు. ‘ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచిన వెంటనే ఒక ప్లేయర్ స్టంప్‌ను తీసుకొని దానిని సంతోషంగా ఊపడం నన్ను ఆకర్షించింది. ఆ విధంగా గద ఐడియా వచ్చింది’ అని అన్నారు.

Also Read: WTC (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) తర్వాత… “రిటైర్మెంట్” ఇవ్వబోతున్న 4 ఇండియన్ ప్లేయర్స్..!

 


End of Article

You may also like