టెస్ట్ మ్యాచ్ సమయంలో క్రికెటర్లు ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా.? వాళ్ళు ఏం తింటారంటే.!

టెస్ట్ మ్యాచ్ సమయంలో క్రికెటర్లు ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా.? వాళ్ళు ఏం తింటారంటే.!

by Mohana Priya

Ads

సాధారణంగా సెలబ్రిటీలు అంటే మన అందరికీ ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు నిజ జీవితంలో ఎలా ఉంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. సెలబ్రిటీలు అంటే మనలో చాలా మందికి గుర్తొచ్చేది సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఇంకా క్రికెట్ రంగానికి చెందిన వాళ్ళు.

Video Advertisement

what do cricketers eat during the test match

క్రికెట్ రంగానికి చెందిన వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉందా, సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలకు ఎక్కువ క్రేజ్ ఉందా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే మన భారతదేశంలో రెండింటినీ సమానంగా అభిమానిస్తారు. అయితే మనలో కొంత మందికి అయినా వచ్చే ప్రశ్న క్రికెటర్లు  ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అని.

what do cricketers eat during the test match

టెస్ట్ మ్యాచ్ సమయంలో క్రికెటర్లు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎక్కువ లంచ్ కానీ, బ్రేక్ ఫాస్ట్ కానీ తీసుకొనివ్వరు. మామూలుగా అయితే క్రికెటర్లు బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బట్టర్, ప్రోటీన్ బార్ లేదా అరటి పండు తీసుకుంటారు.

what do cricketers eat during the test match

ఇవన్నీ మ్యాచ్ అయ్యే ముందు బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకుంటారు. లంచ్ సమయంలో అయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే అలాంటి ఆహారమైతే సులభంగా అరుగుతుంది, అలాగే క్రికెటర్లకి ఫీల్డ్ లో పరిగెత్తడానికి కానీ, ఆడడానికి కానీ ఇబ్బంది కలగదు.

what do cricketers eat during the test match

చాలా మంది ప్లేయర్స్ బాయిల్డ్ చికెన్ సలాడ్, బ్రౌన్ రైస్, ప్రోటీన్ బార్స్ లేదా కూరగాయలను తీసుకుంటారు. చాలా వరకు ప్లేయర్ల లంచ్ టైం ఆ మ్యాచ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవడానికి అలాగే నెక్స్ట్ మ్యాచ్ కోసం మళ్లీ తగినంత విశ్రాంతి తీసుకోవడానికి అయిపోతుంది.

what do cricketers eat during the test match

ఆస్ట్రేలియా కి ఇంగ్లాండ్ కి మధ్య జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఈ లంచ్ తీసుకున్నారు.

# అవకాడో, మ్యాంగో, దిల్ సలాడ్ విత్ అవకాడో డ్రెస్సింగ్.

#కినోవా, క్రాన్ బెర్రీ, ఫెటా (ఒక రకమైన చీజ్) సలాడ్.

# పెసల గింజల కూర, ఆకు కూర.

# రోస్ట్ చేసిన చిలకడదుంప, దానితో పాటు షెజ్వాన్  సీజనింగ్.

# హనీ సోయి, పక్ చోయి జింజర్ తో పాటు రోస్ట్ చేసిన చికెన్ బ్రెస్ట్.


End of Article

You may also like