Home Sports Adda వేలంలో ఇంత పెద్ద ప్లేయర్ ని మర్చిపోయారా..? అసలు ఏం జరిగింది..?

వేలంలో ఇంత పెద్ద ప్లేయర్ ని మర్చిపోయారా..? అసలు ఏం జరిగింది..?

by Mohana Priya

శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్ (LPL 2023) వేలం మొదటి సారి జరిగింది. ఈ వేలం జూన్ 14వ తేదీన నిర్వహించారు. ఇందులో దాదాపు 360 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

కానీ టీం ఇండియా తరపు నుండి మాత్రం కేవలం ఒక ప్లేయర్ మాత్రమే ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. టీం ఇండియా నుండి కేవలం సురేష్ రైనా మాత్రమే ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు.

why lpl 2023 forgot this player

అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకడం, అలాగే ఐపిఎల్ లో కూడా ఏ జట్టు తరఫున ఆడకపోవడం అనేది సురేష్ రైనాకి ఒక పెద్ద ప్లస్ అయ్యింది. అయితే దాంతో సురేష్ రైనాకి ఇందులో చాలా మంచి ధర పలుకుతుంది అని అందరూ ఆశించారు. కానీ ఆ ఆశలు, అసలు అనుకున్నది అంతా కూడా తలకిందులు అయ్యింది. ఒక సమయంలో లంక ప్రీమియర్ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సురేష్ రైనా పేరు వచ్చే అవకాశం ఉంది అని కూడా అనుకున్నారు.

reason behind csk not picking suresh raina

కానీ అలా జరగలేదు. అసలు వేలం జరిగినప్పుడు సురేష్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అమ్ముడు అవ్వని ప్లేయర్స్ లిస్ట్ లో కూడా సురేష్ రైనా లేరు. దాంతో అసలు సురేష్ రైనా పేరు ఎక్కడికి పోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఈవెంట్ కి చారు శర్మ హోస్ట్ గా వ్యవహరించారు. బహుశా అనౌన్స్ చేయడం మర్చిపోయారు ఏమో అని కూడా అన్నారు. దాంతో అసలు సురేష్ రైనా ఉన్నారా లేదా అని అనుమానం అందరిలో నెలకొంది. సురేష్ రైనాకి ఐపీఎల్ లో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

highest payed Indian cricketers for bat sponsorship

కానీ లంక ప్రీమియర్ లీగ్ లో మాత్రం నిరాశ కలిగించే అనుభవం ఎదురు అయ్యింది. అసలు ఈ విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. సురేష్ రైనా ఇందులో ఉన్నారా? పేరు మర్చిపోయారా? అసలు అంత రికార్డ్ ఉన్న వ్యక్తిని ఎలా మర్చిపోతారు? ఇలా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంక సురేష్ రైనా ఆడే అవకాశం లేదు అని అంటున్నారు.

ALSO READ : “డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయాలా..?” అంటూ… ఫైర్ అవుతున్న గంభీర్..! ఏం జరిగిందంటే..?

You may also like