“ఇంత దానికీ ఈ మ్యాచ్ లు అవసరమా..?” అంటూ… BCCI పై “హైదరాబాద్” ప్రజల ఆగ్రహం..! కారణం ఏంటంటే..?

“ఇంత దానికీ ఈ మ్యాచ్ లు అవసరమా..?” అంటూ… BCCI పై “హైదరాబాద్” ప్రజల ఆగ్రహం..! కారణం ఏంటంటే..?

by Mohana Priya

Ads

ఈ సంవత్సరం చివర్లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ విషయంలో తమపై శీతకన్ను వేశారని హైదరాబాద్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరగనున్న 10 ప్రధాన వేదికలలో హైదరాబాదు ఒకటి.

Video Advertisement

అయితే ప్రతి స్టేడియంలో నాలుగు మ్యాచ్ల వరకు జరుగుతుండగా హైదరాబాదుకి మాత్రం మూడు మ్యాచ్‌ల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా జరుగుతున్న మూడు మ్యాచులు అంత ప్రాధాన్యం లేనివి కావడం గమనార్హం.

మరీ ముఖ్యంగా టీమ్ ఇండియాకు సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాద్ కు కేటాయించలేదు. ఇచ్చిన మూడు మ్యాచ్లలో రెండు పాక్ మరియు ఒకటి న్యూజిలాండ్ జట్లు పాడనున్నాయి. ఇచ్చిన మూడు మ్యాచ్లు కూడా కేవలం నాంకే వాస్తే మ్యాచులు కావడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇంత మాత్రం దానికి హైదరాబాదులో మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ మినహా మిగిలిన 9 స్టేడియంలో టీమిండియా కు సంబంధించిన మ్యాచులు ఉన్నాయి. ముఖ్యంగా అందులో చెన్నై కూడా ఉంది.. దీంతో తెలుగు వారికి అన్యాయం చేస్తున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల బీసీసీఐ తీరు సరిగ్గా లేదు అని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జాబితా విడుదలైన కొన్ని గంటలలోనే తమకు అన్యాయం జరిగిందని తెలుగువారు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు పెడుతున్నారు.

BCCI thought of applying new rule after the loss in world cup..

హైదరాబాదులో జరగనున్న మ్యాచుల విషయానికి వస్తే అక్టోబర్ 5న ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్, అరుణ న్యూజిలాండ్ మరియు క్వాలిఫైయర్ 1, తిరిగి 12న పాకిస్తాన్ మరియు క్వాలిఫైయర్ 2 మధ్య పోటీ జరుగుతుంది. మరి ఇలా ఎటువంటి ప్రాముఖ్యం లేని మ్యాచ్లను హైదరాబాదుకు అంట కట్టి మిగిలిన 9 రాష్ట్రాలకు పెద్దపీట వేయడం బీసీసీఐ మన రాష్ట్రం పట్ల చూపుతున్న విపక్ష అని అందరూ భావిస్తున్నారు.


End of Article

You may also like