IND Vs PAK మ్యాచ్ కోసం హోటల్ బుక్ చేసుకోవడానికి బదులు… ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

IND Vs PAK మ్యాచ్ కోసం హోటల్ బుక్ చేసుకోవడానికి బదులు… ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Mohana Priya

Ads

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫాన్స్ ఏ లెవెల్ లో ఎదురు చూస్తారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందునా అది వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఇక క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈసారి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరగబోయే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ అక్టోబర్ 15 న అహ్మదాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ని చూడడం కోసం అభిమానులు ఎగబడుతున్నారు.

Video Advertisement

దూర ప్రదేశాల నుంచి రావడానికి కూడా వెనుకాడని వారు ఎందరో ఈ మ్యాచ్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. మార్చుకో ఇంకా ఎంతో టైం ఉంది అయినా ఇప్పటికే హోటల్ రూమ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు అహ్మదాబాద్ హోటల్ యజమానులు కూడా బుకింగ్ రేట్స్ విపరీతంగా పెంచేశారు. ఆవరేజ్ హోటల్ కి కూడా 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ind vs pak

స్టార్ హోటల్స్ అయితే ఏకంగా ఒక్క రోజుకి లక్ష రూపాయలు వరకు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి అలా ఉన్నప్పటికీ చాలా వరకు హోటల్లో బుకింగ్ ఫుల్ అయిపోయింది. ఇక ఏం చేయాలో తెలియని అభిమానులు తగ్గేదే లేదని ఆల్టర్నేట్ గా నరేంద్ర మోడీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో బెడ్స్ ను కూడా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

బుకింగ్ కోసం ఇప్పటికే తమ దగ్గరకు ఎన్నో రిక్వెస్ట్లు వచ్చినట్లు స్టేడియం చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ యజమానులు తెలియజేస్తున్నారు. కొందరు హాస్పిటల్లో బెడ్ ఇవ్వడానికి సుమారు రోజుకు మూడు నుంచి 25000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్డు తో పాటు పూర్తి మెడికల్ చెక్ అప్ లాంటి వసతులు కూడా ఇవ్వడంతో అనవసరంగా హోటల్ గదులకు వేలకు వేలు పోసి వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చాలామంది హ్యాపీగా హోటల్స్ బదులు హాస్పిటల్స్ బుక్ చేసుకుంటున్నారు.

ఒకే ఖర్చుతో ఎంటర్టైన్మెంట్ తో పాటు హెల్త్ చెకప్ కూడా పూర్తవుతుంది అని భావిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ కోసం రెండు మ్యాచ్లు ఉన్నప్పటికీ అవి శ్రీలంకలో జరుగుతున్నాయి. ఇండియా వేదికగా జరిగే ఒకే ఒక మ్యాచ్ ఇదే కావడంతో అహ్మదాబాద్ హాస్పిటల్స్ కూడా వచ్చే అభిమానులకు విడిదిగా మారబోతున్నాయి.


End of Article

You may also like