Ads
మహేంద్ర సింగ్ ధోనీ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? అనేది గత రెండు సంవత్సరాలుగా అటు వార్తల్లో, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ లో వస్తున్న ప్రశ్న. ప్రస్తుతం భారత జట్టు మాజీ కెప్టెన్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా కొనసాగుతున్నప్పటికీ ధోనీ వారసుడు ఎవరు అనే విషయం ఎవరికి తెలియడం లేదు.
Video Advertisement
ఇన్ని రోజులు ఆ విషయం బయటికి రానప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా మారే క్రికెటర్ ఎవరో తాజాగా బహిర్గతం అయ్యింది. ఆ విషయాన్ని జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయటపెట్టారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
చాలా రోజుల నుండి ఐపీఎల్ నుండి ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ధోని ఈ సంవత్సరమే తప్పుకోవాల్సింది. కానీ తదుపరి జట్టు కెప్టెన్ ఎవరు అనే విషయం పై స్పష్టత రాకపోవడంతో ధోనీ తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకున్నారని, అది ఇప్పుడు పూర్తి అయ్యిందని, అందువల్ల ధోని ఎప్పుడైనా తప్పుకోవచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి రాయుడు, సిఎస్‌కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూనే, యువ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించి, పరోక్షంగా అతనే తదుపరి కెప్టెన్ అని తెలిపాడు. యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పై రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ ధోనీలా ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. అతనిలో లీడర్ షిప్ లక్షణాలు దాగున్నాయని, ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సహాయంతో రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువ కాలం సేవలు అందించగలడని వెల్లడించారు.
ఆసియన్ గేమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ భారత పురుషుల టీమ్ కు కెప్టెన్‍గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమ్ ఇండియా ప్రదర్శన మీదనే రుతురాజ్ సీఎస్కే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. టీమిండియా ఒకవేళ స్వర్ణం సాధించినట్లయితే సిఎస్‌కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరికినట్లే.
Ambati Rayudu on Future CSK Captain Ruturaj Gaikwad 💛🔥 pic.twitter.com/mXsixNt5m4
— Chakri Dhoni (@ChakriDhoni17) July 21, 2023
Also Read: భారతదేశ “క్రికెట్” చరిత్రలో… టీంలో 5 దురదృష్టకర ప్లేయర్స్..!
End of Article