Ads
మెరుగైన ప్రదర్శన కనబరిచే భారత్ ఒక్కొక్కసారి ఒత్తిడిని తట్టుకోలేక చేతులు ఎత్తడం బాగా కామన్ అయిపోయింది. సరిగ్గా గెలవాలి అని కోరుకున్న మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా చివరిలో చేతులు ఎత్తేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం టీమ్ ఇండియాకు పరిపాటి. సీనియర్‌లే అనుకుంటే ఇప్పుడు జూనియర్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
Video Advertisement
శ్రీలంక వేదికగా ముగిసినటువంటి ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన పోరులో 128 పరుగుల భారీ తేడాతో భారత్ జట్టు ఓటమి పాలయింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి అందరి అంచనాలను విపరీతంగా పెంచిన భారత టీం ఫైనల్‌లో మాత్రం పేలవమైన పర్ఫామెన్స్‌తో చేతులెత్తేసింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ భారత్ జట్టు ఫీల్డింగ్ పుణ్యమా అని 352 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్ మాత్రం 224 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఈరోజు మ్యాచ్ ఆడిన అందరిలోకి సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ 61 పరుగులు సాధించి కాస్త మెరుగైన పర్ఫామెన్స్ కనబరిచాడు.
ఈ నేపథ్యంలో టీం ఎంపిక విషయంలో బీసీసీఐ వివక్ష చూపింది అని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రియాన్ పరాగ్ లాంటి చెత్త ప్లేయర్లను టీం ఇండియాలో ఎలా తీసుకున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొడతాను.. టీం ఇండియా బెస్ట్ ఫినిషర్ అవుతాను.. అని మ్యాచ్‌కి ముందు డబ్బాలు కొట్టిన వ్యక్తికి కనీసం బ్యాట్‌తో ఎలా ఆడాలో కూడా తెలియదు అని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ALSO READ : మీరు కొంటున్న బంగారం అసలుదా? నకిలీదా..? ఎలా తెలుసుకోవాలి అంటే..?
End of Article