Ads
ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతం అని అంటారు. ఏ క్రీడకు లేని క్రేజ్, పాపులారిటీ క్రికెట్ కు ఉందనడం అతియోశక్తి కాదు. భారత్ క్రికెటర్లు ధరించే నీలిరంగు జెర్సీని ఇష్టపడని క్రికెట్ ఫ్యాన్ ఉండరేమో. అయితే ఈ బ్లూ జెర్సీని ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నప్పటికీ, ఈ జెర్సీ పైన ఉండే మూడు స్టార్స్ ఎందుకు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదని చెప్పవచ్చు.
Video Advertisement
బ్లూ జెర్సీకి కుడివైపున్న ఉన్న బీసీసీఐ లోగో పైన మూడు స్టార్స్ ను 2011 తరువాత ముద్రించారు. అయితే ఈ మూడు స్టార్స్ ను ఎందుకు భారత జట్టు జెర్సీ పై రూపొందించారు. ఈ 3 స్టార్స్ దేనిని సూచిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ స్పోర్ట్స్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ ‘నైక్’ 2011 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత భారత క్రికెటర్ల జెర్సీ పై ఈ మూడు స్టార్‌లను పరిచయం చేసింది. అలా ముద్రించడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ఇండియా మూడు ప్రపంచ కప్ లను గెలుచుకుంది.
1983లో ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత జట్టు తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ఈ కప్ గెలిచింది. 2007లో భారత జట్టు తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంతో రెండవ ప్రపంచకప్ విజయం సాధించింది. 2011లో వాంఖడే స్టేడియంలో ఎం ఎస్ ధోని సారధ్యంలో భారత క్రికెట్ జట్టు మూడవ ప్రపంచ కప్ ను సాధించింది.మూడు ప్రపంచ కప్ లు గెలుచుకోవడంతో మూడు స్టార్లను భారత జెర్సీలో రూపొందించారు. అది మాత్రమే కాకుండా గ్రౌండ్ లో క్రికెటర్లకు స్ఫూర్తి నింపేందుకు గాను ఈ మూడు నక్షత్రాలను జెర్సీలో రూపొందించారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటివరకు 5 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు లోగోలో 5 నక్షత్రాలు ఉన్నాయి. వాస్తవానికి పుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది.
Also Read: మొన్న ఏమో వాటర్‌బాయ్… ఇప్పుడు ఏమో..? ఏంటి కోహ్లీ ఇది..?
End of Article