Ads
కొంతకాలంగా పేలవమైన ఫామ్, ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న భారత జట్టు ఓపెనర్ పృథ్వీ షా ఇంగ్లాండ్ లో జరుగుతున్న వన్డే కప్ టోర్నీలో ఫామ్ లోకి వచ్చాడు. ఒకే ఇన్నింగ్స్ తో నేరుగా ప్రపంచ కప్ రేస్ లో వచ్చేసాడు.
Video Advertisement
ఫ్యూచర్ స్టార్ గా ప్రశంసలు పొందిన పృథ్వీ షా, కొంతకాలంగా నుండి ఫిట్ నెస్ సమస్యలు, వివాదాలు, విమర్శలతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లాంటి టోర్నీ, ఐపీఎల్ లో కూడా విఫలమయ్యాడు. ఇక భారత జట్టులో స్థానం దొరకడం దాదాపు అసాధ్యం అనే సమయంలో పృథ్వీ షా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
ఇంగ్లండ్ లో జరుగుతున్న వన్డే కప్ టోర్నీలో ఓపెనర్ పృథ్వీ షా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 23వ మ్యాచ్‌లో సోమర్‌సెట్ పై డబుల్ సెంచరీ చేసిన షా, అనంతరం డర్హామ్ పై కూడా సెంచరీ కొట్టాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ ఓపెనర్ గా వచ్చిన పృథ్వీ, 76 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లతో 125 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ 125 రన్స్ తో పృథ్వీ షా ‘లిస్ట్ ఏ’ క్రికెట్‌లో మూడు వేల పరుగులను చేశాడు.
పృథ్వీ షా సాధించిన రికార్డులు..
- వన్డే కప్ టోర్నీలో 400 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా పృథ్వీ షా నిలిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసిన పృథ్వీ ఇప్పటి దాకా డబుల్ సెంచరీ మరియు సెంచరీతో కలిపి 429 పరుగులు చేశాడు.
- ఈ టోర్నీలో 400కు పైగా రన్స్ చేసిన పృథ్వీ షా ‘లిస్ట్ ఏ’ క్రికెట్‌లో 57 మ్యాచ్‌ల్లో ఆడి. 3,000 రన్స్ పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 57 మ్యాచులు ఆడిన పృథ్వీ 57.66 సగటుతో 3,056 రన్స్ చేశాడు. 10 సెంచరీలు, పదకొండు అర్ధ సెంచరీలు చేశాడు.
- లిస్ట్ ఏ క్రికెట్‌లో 2000 కన్నా ఎక్కువ రన్స్ చేసిన ఇండియన్స్ లిస్ట్ లో పృథ్వీ షా 3వ స్థానంలో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ (60.32) మొదటి స్థానం, రెండో స్థానంలో ఛెతేశ్వర్ పుజారా (58.15) ఉండగా, తాజాగా 57.66 సగటుతో పృథ్వీ షా 3వ స్థానంలో నిలిచాడు.Also Read: టీం ఇండియా జెర్సీ మీద… 3-స్టార్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఏంటంటే..?
End of Article