Ads
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న మ్యాచ్ కు సమయం వచ్చేసింది. ఆసియాకప్-2023లో భాగంగా దాయాదుల పోరు సెప్టెంబర్ 2న జరగనుంది.
Video Advertisement
అయితే ఆసియా కప్ 2023 టోర్నీలోనే హై ఓల్టేజ్ మ్యాచ్ గా భావిస్తున్న ఈ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్ కు ఆటంకంగా వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మ్యాచ్ రద్దవుతుంది. దానితో పాకిస్తాన్ సూపర్ 4కు వెళ్తుంది. మరి భారత్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శనివారం నాడు జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. చిరకాల ప్రత్యర్థులు మధ్య జరగబోయే ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం అటు రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్, ఇటు బాబర్ ఆజం సారధ్యంలోని పాకిస్థాన్ జట్లు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఇక భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్లన్ని సేల్ అయ్యాయి.
ఈ క్రమంలో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానులలో నెలకొంది. దానికి కారణం గురువారం కాండే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ జరిగే టైమ్ లో 90 శాతం వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడి వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దాంతో ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు 1-1 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు.రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ జట్టుకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్‌లో నేపాల్ పై గెలిచి పాక్, ఇప్పటికే 2 పాయింట్లు దక్కించుకుని ఆసియా కప్ పాయింట్ల టేబుల్ టాప్ ప్లేస్ లో ఉంది. భారత్ తో మ్యాచ్ రద్దయితే, వచ్చిన పాయింట్ తో పాక్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది. దాంతో డైరెక్ట్ గా సూపర్ ఫోర్ రౌండ్‌కి క్వాలిఫై అవుతుంది. కానీ టీంఇండియాకి ఒక పాయింట్ వచ్చినా, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ భారీ రన్ రేట్‌తో విజయం సాధిస్తేనే సూపర్ ఫోర్ రౌండ్‌కి అవకాశం ఉంటుంది.
End of Article