పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో… టీం ఇండియా చేస్తున్న మిస్టేక్ ఇదేనా..?

పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో… టీం ఇండియా చేస్తున్న మిస్టేక్ ఇదేనా..?

by kavitha

Ads

ఇండియాలో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. అందులోనూ భారత్, పాకిస్థాన్ మధ్యన మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ పై అంచనాలు, భావోద్వేగాలు, ఉద్రేకాలు ఒ రేంజ్ లో ఉంటాయి. చాలా కాలం తర్వాత ఆసియా కప్‌ 2023లో అలాంటి సందర్భం వచ్చింది. దీంతో దాయాదుల మధ్య జరుగబోయే పోరు పైనే యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టి పడింది.

Video Advertisement

భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ నేడు(సెప్టెంబర్ 2) పల్లికెలెలో జరగనుంది. అయితే పాక్ ఒకరోజు ముందే తమ జట్టును ప్రకటించింది. అయితే భారత్ కీలక ప్లేయర్ లేకుండా బరిలోకి దిగబోతుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత మ్యాచ్ ల్లో పాకిస్థాన్ భారత జట్టుకు పోటీ ఇచ్చిన విధానంతో ఈసారి జరగబోయే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన ప్రతిసారి గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ, బాబర్‌ల జట్లు రెండు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో అందరి దృష్టి సెప్టెంబర్ 2న జరగే మ్యాచ్ పై ఉంది. అయితే ఈ ఈ మ్యాచ్‌లో ఎవరి పై ఎవరు విజయం సాధిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
పాక్ ఆడబోయే జట్టును ఒక్క రోజు ముందే ప్రకటించింది. నేపాల్ పై విజయం సాధించిన జట్టు భారత్ తో తలపడనుంది. ఆ జట్టు సత్తాను బట్టి భారత జట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్‌ కు తేలికగా మారింది. అయితే భారత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరూ కూడా లేకుండానే ఆసియా కప్ ఆడడం కోసం వెళ్లింది. గతేడాది పాకిస్థాన్ టాప్ ఆర్డర్‌ను పడగొట్టి భారత జట్టు విజయానికి కారణం అయిన అర్ష్‌దీప్ సింగ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నప్పటికీ అతను లేకుండానే ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు సిద్ధపడింది.
గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ జట్టును కూల్చేసిన ఆటగాడిని కోల్పోతే, భారత్ జట్టు సమస్యలు ఎదుర్కొవచ్చు. భారత్ జట్టులో ఒక్కరు కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేని పరిస్థితుల్లో, పాక్ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన షాహీన్ షా ఆఫ్రిది జట్టులో ఉన్నాడు. ఇది భారత జట్టుకు అతిపెద్ద సవాల్ అని అంటున్నారు.

Also Read: IND VS PAK : వర్షం వల్ల భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు అయితే..? టీమిండియా పరిస్థితి ఏమిటి..?


End of Article

You may also like