Ads
ఆసియా కప్ 2023లో ఫైనల్ కు చేరిన భారత జట్టు ఆదివారం నాడు ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్థాన్ తో తలపడనుంది. టీంఇండియాతో తలపడే జట్టు ఏది అనేది ఈరోజు జరగబోయే శ్రీలంకకు పాక్ మధ్య జరిగే మ్యాచ్‌తో తెలుస్తుంది.
Video Advertisement
కాగా సెప్టెంబర్ 15న టీంఇండియా బంగ్లాదేశ్ కు మధ్య ఆఖరి సూపర్-4 మ్యాచ్ జరగనుంది. ఆల్రెడీ టోర్నీ నుండి ఎలిమినేట్ అయిన జట్టు కాబట్టి, ఈ మ్యాచ్‌లో భారత జట్టులో కొన్ని మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆదివారం నాడు ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి అందులో ఆడే ప్లేయర్స్ కు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అందువల్ల శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా ఫైనల్స్ కోసం విశ్రాంతి తీసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ను పొందవచ్చు.
రోహిత్ శర్మ పేస్ బౌలర్లను పొదుపుగా వాడాడు. బుమ్రాను ఫిట్‌గా ఉంచడం కోసం పాక్ పై ఐదు5 ఓవర్లు, శ్రీలంక పై 7 ఓవర్లు వరకే బౌలింగ్ చేయించాడు. ఇక మహ్మద్ సిరాజ్ కు రెండు మ్యాచ్‌ల్లో 10 ఓవర్లు వరకు బౌలింగ్ చేయించాడు. దాంతో వీరికి విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అలసిపోతున్నాడు. కాబట్టి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది.
లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రపంచ కప్ 2023కి ఉత్తమ బౌలర్‌గా మారాడు. అతన్ని గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో , రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ కి రావచ్చు. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా లేడు. అందువల్ల కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చని, 4వ స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వస్తాడు. సూర్యకుమార్ యాదవ్‌కు బంగ్లాదేశ్‌లో మ్యాచ్ లో బరిలోకి దిగవచ్చు అని అంటున్నారు.
Also Read: ఇతని ఓవరాక్షన్ వల్లే టీం ఇండియా పాకిస్తాన్ పై మూకుమ్మడి దాడి చేశారా..? ఎవరంటే..?
End of Article