Ads
విరాట్ కోహ్లీ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండరని చెప్పవచ్చు. రన్ మిషిన్ గా పేరుగాంచిన కోహ్లీ రికార్డుల రారాజులా దూసుకెళ్తున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యం ఆనుకున్న సమయంలో కోహ్లీ సెంచరీల బాదుతూ ఫ్యాన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశాడు.
Video Advertisement
అభిమానులు ప్రేమగా కింగ్ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు చేశాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ జాతకం ప్రకారం భారత జట్టు ప్రపంచకప్ గెలిచే అవకాశం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ ఫ్యామిలిలో జన్మించాడు. న్యూ ఢిల్లీలో పెరిగిన కోహ్లి, వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో క్రికెట్ లో శిక్షణ పొందాడు. ఢిల్లీ అండర్-15 జట్టుతో తన కెరీర్ మొదలుపెట్టాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తక్కువ సమయంలో వన్డే జట్టులో ముఖ్యమైన ప్లేయర్ గా మారాడు. ఆ తర్వాత టెస్టుల్లో 2011లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో, కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిసారి నంబర్ వన్ ప్లేస్ కు చేరుకున్నాడు.
తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం, కొన్ని రోజులుగా ఫామ్‌లో లేని కోహ్లీ, ఇటీవల జరిగిన మ్యాచ్‌లతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా సెంచరీలు బాదుతున్నాడు. కొన్ని రోజుల్లో వరల్డ్ కప్ జరగనుంది. ఈసారి ప్రపంచ కప్‌లో కోహ్లీ పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యలో కోహ్లీ జాతకం ప్రకారం టీంఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. విరాట్ కోహ్లీది మీన రాశి, ఈ ఏడాది గ్రహాల సంచారం వల్ల మంచి ఫామ్‌లో ఉంటాడు.
నెక్స్ట్ మ్యాచ్‌ల్లో కూడా కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. శుక్రుడు, శని, చంద్రుడు కోహ్లికి అవకాశాలను కల్పిస్తారు. విరాట్ కోహ్లీ లైఫ్ లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. కోహ్లీ జాతకంలో అదృష్టాన్ని ఇచ్చే రాజయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రహా స్థితి చాలా బాగుంది. కోహ్లీ జాతకం ప్రకారంగా భారత జట్టు వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!
End of Article