Ads
2023 ప్రపంచ కప్ లో భారత్ ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ లోను టీమిండియా విజయాన్ని సాధించింది. ప్రతి మ్యాచ్ లో ఒకరు సూపర్ స్టార్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఇదే ఫామ్ కొనసాగించి కప్పు కొట్టాలని ఇండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Video Advertisement
అయితే టీమిండియాలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయం అందరిని కలవర పరుస్తుంది. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ పెర్ఫార్మన్స్ తో టీం లో ఉంటే జట్టుకి ఆ బలమే వేరు. అయితే అలాంటి ప్లేయర్ ఇప్పుడు గాయం బారిన పడటం టీమిండియా కు ప్రతికూల అంశమే.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆ హార్దిక్ గురించి మరో బ్యాడ్ న్యూస్ అందింది. ఇప్పుడు ప్రపంచ కప్ లో మిగతా మ్యాచ్ లు అన్నిటికి హార్దిక్ దూరం కానున్నాడని భారత చక్కర్లు కొడుతుంది. హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ఏ లిగ్మెంట్ టియర్ ఉంది. దీంతో హార్దిక్ కోల్పోవడానికి రెండు వారాల సమయం పట్టవచ్చు.
ఈ పరిస్థితుల్లో నవంబర్ 2న శ్రీలంకతో మరియు నవంబర్ 5న దక్షిణఆఫ్రికా తో జరిగే మ్యాచ్ లకు దూరంగా ఉండవచ్చు.హార్దిక్ ను బెంగళూరుకు చెందిన ఎన్.సి.ఏ ఆధ్వర్యంలో నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం చూసుకుంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయం మునిపటి కంటే తీవ్రంగా కనిపించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆందోళన చెందుతున్నారు.
హార్దిక్ లేకపోతే బౌలింగ్ విభాగంలో కేవలం ఐదుగురు బౌలర్స్ తోనే బల్లోకి దిగి అవకాశం ఉంది. దీంతో ఆరో బౌలర్ సేవలను టీమిండియా కోల్పోనుంది.అయితే హార్దిక్ స్థానంలో అక్షర పటేల్ వంటి స్పిన్ రౌండర్ ని తీసుకురావాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్షర పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. దీంతో ఒకవేళ హార్దిక్ గాయంతో దూరమైతే అక్షర్ కు అవకాశం ఉంది.
Also Read:ఈ వరల్డ్ కప్ లో డేంజరస్ బ్యాటర్ అతనే అంట..? రోహిత్, కోహ్లీ కాదు.!
End of Article