సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కోసం టీం ఇండియాలో భారీ మార్పులు..! అవి ఏంటంటే..?

సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కోసం టీం ఇండియాలో భారీ మార్పులు..! అవి ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

2023 వన్డే ప్రపంచ కప్ లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల లోనూ నెగ్గి సెమీస్ కి చేరి టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలబడింది. అయితే ఇప్పుడు ఆసక్తికర పోరుకు భారత్ టీమ్ సిద్ధమైంది. భారత్ కి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగా వీటిలో ఓడిన పెద్ద నష్టం ఉండదు. కాకపోతే టేబుల్ టాపర్ గా కొనసాగాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లలో భారత్ గెలవాల్సి ఉంది.

Video Advertisement

ఈ క్రమంలో భారత్ నవంబర్ 5న సౌత్ ఆఫ్రికా తో తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.పెద్ద పెద్ద మార్పులు లేకుండా ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లను ఆడింది. దాంతో పలువురు ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి బెంచ్ ను పరీక్షరించాలనే ఆలోచనలో రోహిత్ ఉన్నట్లు తెలుస్తుంది.


ఇదే జరిగితే సౌత్ ఆఫ్రికా తో జరిగే పోరులో బూమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ ని కూడా పక్కనపెట్టి అతని స్థానంలో ఇషాన్ కిషన్ కు స్థానం కల్పించే అవకాశం ఉంది. బూమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తుది జట్టులోకి తీసుకుంటారనే మాట వినబడుతుంది.ఒకవేళ సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ ప్లేయింగ్ 11లో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం రోహిత్ శర్మ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. గతంలో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

అదే జరిగితే అప్పుడు కేల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడు మిగిలిన రెండు లీగ్ మ్యాచ్ లకి దూరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా సెమిస్ పై కన్నేసింది. భారత్ పైన ఎక్కితే సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్ కు చేరుతుంది. దాంతో విజయమే లక్ష్యంగా ఆ జట్టు ప్రాక్టీస్ లో దిగింది.

 

Also Read:ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిస్తే పాకిస్తాన్ ఎందుకు ఆనందపడుతోంది..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like