Ads
2023 వన్డే ప్రపంచ కప్ లో మరో ఆసక్తికర సమరానికి వేదిక సిద్ధమైంది. శనివారం బెంగళూరులో పాకిస్తాన్ న్యూజిలాండ్ అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలవడం ఇరుజట్లకు అత్యంత కీలకంగా కావడంతో ఈ మ్యాచ్ పైన అందరి కళ్ళు ఉన్నాయి.
అయితే ఈ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన పని పాకిస్తాన్ ఫాన్స్ ను కలవరపెడుతుంది.
Video Advertisement
ఈ ప్రపంచకప్ లో పాకిస్తాన్ ప్రదర్శన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతిలో కూడా ఓడిపోయింది. సెమిస్ రేస్ లో బాగా వెనుకబడింది. మిగతా రెండు మ్యాచ్ లలో గెలవడంతో పాటుగా ఇతర జట్ల ప్రదర్శన పైన పాకిస్తాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్ లో చావో రేవో తెల్చుకోవాలి.
అసలు విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆఖరిలో బాబర్ ఆజాం పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మనోడు ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి సవ్యసాచి నుంచి ఖరీదైన డ్రెస్ కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ కప్ కోసం భారత వచ్చిన బాబర్ పెళ్లి కోసం పెద్ద ఎత్తున షాపింగ్ చేసినట్లు తెలిసింది. ఆభరణాలు కూడా కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రపంచ కప్పు లాంటి మేజర్ టోర్నీ లో పాల్గొనడానికి వచ్చి పెళ్లి షాపింగ్ ఏంట్రా బాబు అంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
పాక్ చెత్త ప్రదర్శన కారణంగా బాబర్ ను కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తన చేష్టల ద్వారా పాక్ కెప్టెన్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శనివారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే మాత్రం టోర్నీ నుండి నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన పార్క్ కేవలం మూడు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇప్పుడు ఈ కీలక మ్యాచ్ ముందు బాబర్ ఆజం తీరుపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
Also Read:సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కోసం టీం ఇండియాలో భారీ మార్పులు..! అవి ఏంటంటే..?
End of Article