2023 లో మన ఇండియన్ క్రికెటర్లు అందుకుంటున్న జీతాలు ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్లేయర్ ఎవరంటే..?

2023 లో మన ఇండియన్ క్రికెటర్లు అందుకుంటున్న జీతాలు ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్లేయర్ ఎవరంటే..?

by Mounika Singaluri

Ads

ఇండియన్ క్రికెటర్స్ కి బిసిసిఐ ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తుంది. కాంట్రాక్ట్ లో ఉన్న ప్లేయర్స్ ని మాత్రమే సిరీస్ లకి ఎంపిక చేస్తుంది. అయితే కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతి ప్రేయర్ కి గ్రేడులు ప్రకారం జీతాలు చెల్లిస్తుంది. సీనియారిటీ అలాగే వాళ్ళ పెర్ఫార్మన్స్ ని బట్టి గ్రేడ్ లను విభజిస్తుంది. మొత్తం 2023లో 4 గ్రేడ్ ల కింద ప్లేయర్స్ ని విభజించారు. గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్ కి 7 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. గ్రేడ్ ఏ ప్లేయర్ కి 5 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. గ్రేడ్ బి ప్లేయర్ కి 3 కోట్ల రూపాయలు, గ్రేడ్ సీ ప్లేయర్ కి 1కోటి రూపాయలుగా  చెల్లిస్తూ ఉంటారు.

Video Advertisement

ఇక ఫార్మేట్ బట్టి మ్యాచ్ ఫీజు ని ఈ విధంగా డిసైడ్ చేశారు. టెస్ట్ మ్యాచ్ కి అయితే 15 లక్షలు రూపాయలు చెల్లిస్తారు. ఒకవేళ స్క్వాడ్ లో ఉండి ప్లేయింగ్ 11 లో లేకపోతే 7.5 లక్షలు చెల్లిస్తారు.ఇక వన్డే మ్యాచ్ కు వచ్చేసి ఆడే ప్లేయర్ కు 6 లక్షలు, స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్ కు 3 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇక టి20 మ్యాచ్ కైతే ఆడే ప్లేయర్ కి 3లక్షలు స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్ కి 1.5 లక్షలు చెల్లిస్తారు…

ఇక ఇండియన్ టీం లో ఉన్న ఈ ప్లేయర్స్ కి ఏ విధంగా చెల్లిస్తారో చూడండి.

గ్రేడ్ A+:

1. విరాట్ కోహ్లీ:

7 కోట్లు ప్రతి సంవత్సరం బీసీసీఐ కాంట్రాక్ట్ కింద చెల్లిస్తుంది. అలాగే దానికి తోడు మ్యాచ్ ఫీజు కూడా చెల్లిస్తూ ఉంటుంది. ఇండియన్ ప్లేయర్స్ అందరిలో కల్లా రిచెస్ట్ క్రికెటర్ గా ఉన్నారు.

2. రోహిత్ శర్మ:

ప్రతి ఏడాది 7కోట్ల రూపాయలు బీసీసీఐ కాంట్రాక్ట్ కింద చెల్లిస్తుంది. దానికి తోడు మ్యాచ్ ఫీజు అదనం. అలాగే కెప్టెన్ గా ఉన్నందుకు 25% టు 50% మ్యాచ్ ఫీజ్ బోనస్ అనేది లభిస్తుంది.

3. బూమ్ర:

ఈ ఇండియన్ పేస్ బౌలర్ ఏ ప్లస్ కేటగిరి లో ఉన్నాడు. ఇతనికి 7 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఫీజు తో పాటు మ్యాచ్ ఫీజును అదనంగా చెల్లిస్తుంది. ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడేటప్పుడు బోర్డు నుండి అధిక మొత్తంలో లభిస్తూ ఉంటుంది.

4. రవీంద్ర జడేజా:

netizens recall dravid after rohit sharma declares innings with jadeja

ఈ ఇండియన్ ఆల్ రౌండర్ కూడా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. ఇతనికి 7 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఫీజు తో పాటు మ్యాచ్ ఫీజును అదనంగా చెల్లిస్తుంది.

గ్రేడ్ A:

1.హార్దిక్ పాండ్యా:


ఈ ఇండియన్ ఆల్రౌండర్ ఏ కేటగిరీలో ఉన్నాడు. ఇతనికి ఐదు కోట్ల కాంట్రాక్ట్ ఫీజు తో పాటు మ్యాచ్ ఫీజును బీసీసీఐ చెల్లిస్తూ ఉంటుంది.

2. రవిచంద్ర అశ్విన్:

ఈ లీడింగ్ స్పిన్నర్ ఏ కేటగిరి లో ఉన్నాడు. ఇతనికి బీసీసీ 5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఫీజు తో పాటు అదనంగా మ్యాచ్ ఫీజును చెల్లిస్తుంది. ఇతనికి టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షల రూపాయలను చొప్పున అందిస్తుంది.

3. మహమ్మద్ షమీ:

shami

ఈ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఏ క్యాటగిరి లోనే ఉన్నాడు. ఇతనికి ఐదు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఫీజు తో పాటు మ్యాచ్ ఫీజ్ అదనంగా లభిస్తుంది.

గ్రేడ్ B:

1. పూజార:

పూజార కేటగిరి బి లో ఉన్నాడు. ఇతనికి మూడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఫీజు తో పాటు అదనంగా మ్యాచ్ ఫీజును చెల్లిస్తూ ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ లో ఇతనికి 15 లక్షల రూపాయలు లభిస్తాయి.

2. కేఎల్ రాహుల్:

ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కూడా బి కేటగిరి లో ఉన్నాడు. ఇతనికి మూడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఫీజు, అదనంగా మ్యాచ్ ఫీజు లభిస్తాయి. 2022లో గ్రేడ్ ఏ లో ఉన్న రాహుల్ ప్రజెంట్ గ్రేడ్ బి లోకి వచ్చేసాడు.

3. సిరాజ్:

ఈ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ కూడా గ్రేడ్ బి లో ఉన్నాడు. ఇతనికి కాంట్రాక్ట్ ఫీజు కింద మూడు కోట్లు అదనంగా మ్యాచ్ ఫీజు లభిస్తాయి.

4. గిల్:


శుభమాన్ గిల్ కూడా గ్రేడ్ బి లో ఉన్నాడు. ఇతనికి సంవత్సరంలో కాంట్రాక్ట్ కింద మూడు కోట్ల రూపాయలు అదనంగా మ్యాచ్ ఫీజు లభిస్తాయి.

గ్రేడ్ C:

1. ఇషాన్ కిషన్:

ఇషాన్ కిషన్ ప్రస్తుతం గ్రేడ్ సి లో ఉన్నాడు. ఇతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ కింద కోటి రూపాయలతో పాటు అదనంగా మ్యాచ్ ఫీజును చెల్లిస్తూ ఉంటుంది.

2. శిఖర్ ధావన్:

ఈ ఇండియన్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ కూడా గ్రేడ్ సి లో ఉన్నాడు. ఇతనికి ఏడాదికి కాంట్రాక్ట్ కింద కోటి రూపాయలు అదనంగా మ్యాచ్ ఫీజు లభిస్తాయి.

3. చాహల్:


గ్రేడ్ సి లో ఉన్న టాప్ బౌలర్ చాహల్. ఇతనికి ఏడాదికి కాంట్రాక్ట్ కింద కోటి రూపాయలు అదనంగా మ్యాచ్ ఫీజు లభిస్తాయి.

4. కుల్దీప్ యాదవ్:


ఈ చైనా మాన్ బౌలర్ కూడా గ్రేడ్ సి లోనే ఉన్నాడు. ఇతనికి కూడా ఏడాదికి కాంట్రాక్ట్ కింద కోటి రూపాయలు అదనంగా మ్యాచ్ ఫీజు లభిస్తాయి.

Also Read:మరీ ఇంత కుళ్ళా.? భర్త వరల్డ్ కప్ లో అంత మంచిగా ఆడుతుంటే ఓర్వలేక ఏమనిందంటే.?


End of Article

You may also like