నిన్ను విరాట్ అవుట్ చేసాడనే కదా… నీకు ఈ ఏడుపు..? పాకిస్తాన్ ప్లేయర్ కి స్ట్రాంగ్ కౌంటర్..!

నిన్ను విరాట్ అవుట్ చేసాడనే కదా… నీకు ఈ ఏడుపు..? పాకిస్తాన్ ప్లేయర్ కి స్ట్రాంగ్ కౌంటర్..!

by Mounika Singaluri

Ads

వండే ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ పై ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ సెంచరీ తో గెలిపించాడు. ఈ క్రమంలో బెన్ ను అభినందిస్తూనే భారత ఆటగాడు విరాట్ కోహ్లీ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ పరోక్షంగా విమర్శలు చేశాడు. నిస్వార్ధం-స్వార్థానికి మధ్య వ్యత్యాసానికి ఇది ఉదాహరణగా ఉందని అన్నాడు. దీనికి ఓ ఇంగ్లీష్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో ఇది వైరల్ అవుతుంది.

Video Advertisement

ఇంగ్లాండ్ విజయం సాధించుట పైన తోలుత ఆ జట్టు మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ ట్విట్టర్ వేదికగా గొప్ప ఇన్నింగ్స్ బెన్ స్టోక్స్, విరాట్ ఆడిన కోలకత్తాలోని క్లిష్టతరమైన పిచ్ పై దూకుడైన ఆడ తీరు ప్రదర్శించావని పోస్ట్ పెట్టాడు. దీనికి మహమ్మద్ హఫీజ్ స్పందిస్తూ తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన శతకంతో జట్టును గెలిపించావు.

“ఇన్నింగ్స్ ను నిర్మించే క్రమంలో ఇతర సహచరులకు చేదోడు వాదోడుగా ఉన్నావు. జట్టుకు విజయం అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించావు. ఈ మ్యాచ్ స్వార్థం-నిస్వార్థం మధ్య వ్యత్యాసానికి చక్కటి ఉదాహరణ” అంటూ కామెంట్ చేశాడు. దీనిపై మైఖేల్ వాన్ స్పందించాడు. విరాట్ కోహ్లీ నిన్ను బౌల్డ్ చేశాడు కదా, అతడి పై వరుసగా ఇలా స్పందించడానికి కారణం అదేనేమో… అంటూ సమాధానం ఇస్తూ పోస్ట్ పెట్టాడు. దెబ్బకి పాకిస్తాన్ మాజీ ఆటగాడికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చావ్ అంటూ కోహ్లీ అభిమానులు మైఖేల్ వాన్ ని అభినందిస్తూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

kohli

అసలు విషయం ఏంటంటే 2012 t20 ప్రపంచ కప్పులో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్, ఓపెనర్ అయిన హఫీజ్ పార్ట్ టైం బౌలర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అంతేకాకుండా బ్యాటింగ్ లోను కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

Also Read:మాక్స్‌వెల్ 2019 లో క్రికెట్ నుండి బ్రేక్ ఎందుకు తీసుకున్నారు..? ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారా..?


End of Article

You may also like